Headlines

Hyderabad: హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. శుక్రవారం నగర వ్యాప్తంగా మాంసం షాప్‌లు బంద్!


Hyderabad: హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. శుక్రవారం నగర వ్యాప్తంగా మాంసం షాప్‌లు బంద్!

హైదరాబాద్, 02 సెప్టెంబర్ 2026: హైదరాబాద్‌లోని మాంస విక్రయదారులకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కీలక సూచనలు చేసింది. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని 04 సెప్టెంబర్ 2026న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోని అన్ని గొర్రెలు, మేకలు, పశువుల కబేళాలతో పాటు రిటైల్ మాంసం, బీఫ్ దుకాణాలను మూసివేయాలని జీహెచ్ఎంసీ ఆదేశాలు జారీ చేసింది.

జీహెచ్ఎంసీ చట్టం, 1955లోని సెక్షన్ 533(బి) కింద జారీ చేసిన నోటీసు ప్రకారం, శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదిన ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని గొర్రెలు, మేకలు, పశువుల కబేళాలు, మాంసం, బీఫ్ దుకాణాల మూసివేతను సమర్థవంతంగా అమలు చేయడంలో మున్సిపల్ అధికారులకు పూర్తి సహకారం అందించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్లను కోరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *