Headlines

Indian Railways: తెలంగాణలోని రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ప్రత్యేక రైళ్లు వచ్చేశాయి.. ఈ రూట్లో వెళ్లేవారికి.. | South Central Railway Extends Hyderabad to Gorakhpur Special Trains, Check Dates and Timings

Indian Railways: తెలంగాణలోని రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ప్రత్యేక రైళ్లు వచ్చేశాయి.. ఈ రూట్లో వెళ్లేవారికి.. | South Central Railway Extends Hyderabad to Gorakhpur Special Trains, Check Dates and Timings


ప్రయాణికులకు రైల్వేశాఖ మరో శుభవార్త అందించింది. ప్రయాణికుల రద్దీని పరిగణలోకి తీసుకుని ప్రత్యేక రైళ్లను ప్రవేశపెడుతోంది. రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో స్పెషల్ ట్రైన్లను తీసుకొస్తుంది. అందులో భాగంగా తాజాగా మరికొన్ని ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆగస్ట్ 4వ తేదీన ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికుల రద్దీ కారణంగా ఈ రైళ్లను మరికొన్ని రోజుల పాటు పొడిగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ ప్రత్యేక రైళ్ల వివరాలు ఒకసారి చూద్దాం.

హైదరాబాద్-గోరఖ్‌పూర్(07075) ప్రత్యేక రైలును సెప్టెంబర్ 4వ తేదీ నుంచి 25వ తేదీ వరకు అందుబాటులో ఉండనుంది. ప్రతీ శుక్రవారం ఇది అందుబాటులో ఉంటుంది. ఈ రైలు 21.00 గంటలకు హైదరాబాద్‌లో బయల్దేరుతుంది. ఇక గోరఖ్ పూర్-హైదరాబాద్(07076) స్పెషల్ రైలు సెప్టెంబర్ 6 నుంచి 27వ తేదీ వరకు సర్వీసులు అందించనుంది. ఇది ప్రతీ ఆదివారం అందుబాటులో ఉంటుంది. 8.30 గంటలకు గోరఖ్‌పూర్‌లో బయల్దేరుతుంది. ఈ రైలు సికింద్రాబాద్, కాజీపేట్, పెద్దపల్లి, మంచిర్యాల, నాగ్ పూర్, భోపాల్, కాన్పూర్ సెంట్రల్, లక్నో మీదుగా గోరఖ్ పూర్‌కు చేరుకుంటుంది. తెలంగాణలోని రైల్వే ప్రయాణికులకు ఈ రైళ్లు ఎంతో ఉపయోగపడనున్నాయి.  తెలంగాణ నుంచి బయల్దేరి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మీదుగా యూపీకి చేరుకుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *