Headlines

ITR: ఐటీఆర్ ఫైలింగ్‌కు మరో రెండు రోజులే గడువు.. కేవలం 10 నిమిషాల్లో ఎలా ఫైల్ చేయాలి? | ITR filing deadline in two days.. Tax experts explain how you can file returns in just 10 minutes

ITR: ఐటీఆర్ ఫైలింగ్‌కు మరో రెండు రోజులే గడువు.. కేవలం 10 నిమిషాల్లో ఎలా ఫైల్ చేయాలి? | ITR filing deadline in two days.. Tax experts explain how you can file returns in just 10 minutes


ITR Filing Deadline: ఆదాయపు పన్ను రిటర్నుల (ITR) సమర్పణకు మరో రెండు రోజులు మాత్రమే గడువు మిగిలి ఉంది. జూలై 31 ఆఖరి తేదీ కావడంతో పన్ను చెల్లింపుదారులకు 48 గంటల కంటే తక్కువ సమయం ఉంది. అసెస్‌మెంట్ ఇయర్ 2026-27కి సంబంధించి పన్ను సమర్పణ ప్రక్రియ పూర్తి కావాలంటే ఐటీఆర్ ఫైల్ చేయడంతో పాటు ఇ-వెరిఫికేషన్ (e-verify) చేయడం కూడా తప్పనిసరి అని గుర్తించుకోండి. ప్రస్తుతానికి ఎటువంటి ఆలస్య రుసుము (Late fee) లేకుండా రిటర్నులు దాఖలు చేయడానికి జూలై 31 ఆఖరి తేదీ. గత ఏడాదితో పోలిస్తే, ఈసారి ఐటీ శాఖ లేదా ప్రభుత్వం నుంచి గడువు పెంపు ఉండే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్ ఫైలింగ్‌ను మరింత ఆలస్యం చేస్తే, చివరి నిమిషంలో హడావుడి వల్ల తప్పులు దొర్లే ప్రమాదం ఉంది. దీనివల్ల భవిష్యత్తులో ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు వచ్చే అవకాశం ఉంది.

ఇప్పటివరకు 4.37 కోట్లకు పైగా ఐటీఆర్ ఫైలింగ్స్ పూర్తి:

ఇదిలా ఉండగా, ఆదాయపు పన్ను శాఖ తెలిపిన తాజా గణాంకాల ప్రకారం, ఇప్పటివరకు 4.37 కోట్లకు పైగా పన్ను రిటర్నులు విజయవంతంగా దాఖలయ్యాయి. పన్ను చెల్లింపుదారులు వార్షిక పన్ను నిబంధనలను పాటించడానికి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను ఏ స్థాయిలో ఉపయోగిస్తున్నారో ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. జూలై 31 డెడ్‌లైన్‌కు కేవలం రెండు రోజులే మిగిలి ఉన్నందున, ఇంకా ఫైల్ చేయనివారు ఆలస్యం చేయకుండా వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచిస్తున్నారు అధికారులు.

10 నిమిషాల్లోనే ఐటీఆర్ ఫైలింగ్ పూర్తి చేయవచ్చు:

పత్రాలన్నీ సిద్ధంగా ఉంటే ఐటీఆర్ సమర్పణను కేవలం కొన్ని నిమిషాల్లో, ప్రత్యేకించి 10 నిమిషాల కంటే తక్కువ సమయంలోనే పూర్తి చేయవచ్చని పన్ను నిపుణులు చెబుతున్నారు. ఆన్‌లైన్ పన్ను ఫైలింగ్, ఇ-వెరిఫికేషన్ ప్రక్రియను ప్రారంభించే ముందు జీతం, బ్యాంకింగ్ వివరాలు, మినహాయింపులు, ఇతర పెట్టుబడులు, పన్ను చెల్లింపులు వంటి అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో సరిచూసుకోవడం అత్యంత ముఖ్యం. అలాగే, అర్హత ఆధారంగా సరైన ఐటీఆర్ ఫారమ్‌ను ఎంచుకోవడం, ముందే నింపిన వివరాలను సరిచూసుకోవడం ద్వారా తప్పులను నివారించవచ్చు. దీనివల్ల సమయం కూడా బాగా ఆదా అవుతుంది.

ఇవి కూడా చదవండి



పన్ను నిపుణులు ఏమంటున్నారంటే..

ఐటీఆర్ ఫైలింగ్‌కు రెండు రోజులు మాత్రమే సమయం ఉన్నందున, పన్ను చెల్లింపుదారులు చివరి నిమిషం వరకు వేచి ఉండకూడదని నిపుణుడు నిశాంత్ శంకర్ (టాక్స్, ఇన్వెస్ట్‌మెంట్స్ ఎక్స్‌పర్ట్, నవరాజ్ గ్లోబల్ అడ్వైజర్స్‌ సూచిస్తున్నారు. ఫారమ్ 16, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్ (AIS), బ్యాంక్ వివరాలు, ఇన్వెస్ట్‌మెంట్ ప్రూఫ్‌ల వంటి అన్ని ముఖ్యమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. వివరాలన్నీ ముందుగానే తనిఖీ చేసుకుని, సరైన పన్ను విధానాన్ని ఎంచుకుంటే, ఇ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా కేవలం 10 నిమిషాల్లోనే ఖచ్చితత్వంతో రిటర్న్ దాఖలు చేయవచ్చని అంటున్నారు.

ఇది కూడా చదవండి: LPG Price: ఆగస్టు 1 నుంచి గ్యాస్ సిలిండర్ల ధరలు మారనున్నాయా? పెరుగుతాయా? తగ్గుతాయా?

అలాగే వడ్డీ, డివిడెండ్లతో కలిపి మొత్తం ఆదాయం రూ.50 లక్షల వరకు ఉన్న నివాసిత వేతన జీవులు కేవలం 10 నిమిషాల్లో ఐటీఆర్ 1 (ITR-1) ఫైల్ చేయవచ్చని అసోసియేట్ డైరెక్టర్ – డైరెక్ట్ టాక్స్, S K పటోడియా, అసోసియేట్స్ LLP మిహిర్ తన్నా అన్నారు. ఆన్‌లైన్ ఐటీఆర్ మోడ్‌లో వివరాలన్నీ ఆటో-పాపులేట్ (ముందే నమోదు) అయి ఉంటాయని, మనం వాటిని కన్ఫర్మ్ చేస్తే సరిపోతుంది. అయితే, ఏదైనా కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్నవారు లేదా అన్‌లిస్టెడ్ ఈక్విటీ షేర్లలో పెట్టుబడులు ఉన్నవారు ఈ ఐటీఆర్-1 విధానాన్ని ఉపయోగించలేరని పేర్కొన్నారు. జూలై 31 డెడ్‌లైన్ దగ్గరపడుతున్న వేళ, చివరి క్షణం వరకు ఆగకుండా డాక్యుమెంట్లను తనిఖీ చేసుకుని, వెంటనే ఐటీఆర్ ఫైలింగ్, ఇ-వెరిఫికేషన్‌ను పూర్తి చేయడం శ్రేయస్కరమని చెప్పారు.

ఇది కూడా చదవండి: Hyderabad: పార్కింగ్‌లో కారు మిస్సైతే పబ్‌దే బాధ్యత.. భారీ పెనాల్టీ విధించిన హైదరాబాద్ వినియోగదారుల కమిషన్!

ఇది కూడా చదవండి: Minimum Balance: ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ మెయింటెన్ చేయలేదా?.. పెనాల్టీల రూపంలో బ్యాంకులు భారీగా వసూళ్లు..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *