Headlines

Jabardasth: అదిరే అభి సినిమా ఈవెంట్‌కు పిలిచినా రాని హైపర్ ఆది! ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన ‘జబర్దస్త్’ డైరెక్టర్ | Jabardasth Fame Adhire Abhi Gives Clarity About Differences With Hyper Aadi In Karmakhya Promotions

Jabardasth: అదిరే అభి సినిమా ఈవెంట్‌కు పిలిచినా రాని హైపర్ ఆది! ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన ‘జబర్దస్త్’ డైరెక్టర్ | Jabardasth Fame Adhire Abhi Gives Clarity About Differences With Hyper Aadi In Karmakhya Promotions


జబర్దస్త్ కమెడియన్ అదిరే అభి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. లక్షల జీతమొచ్చే జాబ్ ను వదిలి పెట్టి మరీ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన అభి జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సాధారణ కమెడియన్ నుంచి టీమ్ లీడర్ దాకా ఎదిగాడు. అన్నట్లు అదిరే అభి మల్టీ ట్యాలెంటెడ్. ఇతను ఒక మంచి రైటర్. అందుకే ఇప్పుడు దర్శకుడిగా సత్తా చాటుతున్నాడు. దర్శకుడిగా అదిరే అభి తెరకెక్కించిన మొదటి సినిమా చిరంజీవ. రాజ్ తరుణ్‌ ఇందులో హీరోయిన్ గా నటించాడు. ఈ సినిమా పెద్దగా ఆడకున్నా కాన్సెప్ట్ పరంగా ప్రశంసలు అందుకుంది. అలాగే అదిరే అభి డైరెక్షన్ కు కూడా మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు కర్మాఖ్య అంటూ మరో సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడీ జబర్దస్త్ కమెడియన్. మిస్టీరియస్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం (జులై 31) ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ అందుకుంది. కాగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా పలు ఇంటర్వ్యూలకు హాజరయ్యాడు అభి. ఇదే క్రమంలో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడిన అదిరే అభి తన సినిమా ఈవెంట్‌కు ఆదిని పిలిస్తే రానన్నాడని సోషల్ మీడియాలో థంబ్‌నైల్స్ వేసి రూమర్స్ సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక అసలు అలాంటి చర్చ లేదా కాంటెక్స్ట్ ఎప్పుడూ తమ మధ్య రాలేదని, తాను జబర్దస్త్ టీమ్‌లోని ఎవరినీ ప్రత్యేకంగా ఈవెంట్‌కు పిలవలేదని క్లారిటీ ఇచ్చాడీ జబర్దస్త్ కమెడియన్.

‘జర్నలిస్టులు, ప్రెస్ మీట్ కోసం కేటాయించిన చిన్న స్పేస్‌లో మా సినిమా ఈవెంట్ జరిగింది. ఒకవేళ నేను జబర్దస్త్ మిత్రులను పిలిస్తే, అంత బిజీలో వాళ్లకు సరిగ్గా టైమ్ ఇవ్వలేకపోవచ్చు. పైగా అందరి ఫోకస్ ట్రైలర్ మీద కాకుండా వాళ్లపైకి మళ్లుతుంది. అందుకే జబర్దస్త్ నుంచి నేను ఎవరినీ ఇన్వైట్ చేయలేదు. అంతే తప్ప మా మధ్య ఎలాంటి గొడవలు లేదా విభేదాలు లేవు. హైపర్ ఆది నాకు ఎప్పుడూ అండగా ఉంటాడు. నాకు బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చినప్పుడు నాగబాబు గారితో పాటు జబర్దస్త్ బ్యాచ్ అందరితో ఓట్లు వేయించింది ఆదినే. ఇక నా సినిమా టీజర్, ట్రైలర్ ఏది వచ్చినా ఇమ్మీడియట్‌గా ఆది ట్వీట్ చేస్తాడని.. సుధీర్, గెటప్ శ్రీను, అవినాష్, ఇమ్ము, ఇంద్రజ గారు అందరూ నా ప్రాజెక్టులను ప్రమోట్ చేస్తూ సపోర్ట్ చేస్తారు

‘ఇక టీవీ షోలలో మా మధ్య జరిగే సరదా సంభాషణలను, స్కిట్లలో వేసే పంచ్‌లను జనాలు నిజం అనుకుంటుంటున్నారు. అదంతా కేవలం ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకే చేస్తాం. పర్సనల్ గా మా మధ్య మంచి బాండింగ్ ఉంది. జబర్దస్త్ వేదికపై నుంచి వచ్చిన వారందరూ బయట ఎంతో ఆప్యాయంగా ఉంటారు. ఒకరి ఎదుగుదలకు మరొకరు సపోర్ట్ చేసుకుంటారు’ అని అదిరే అభి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ జబర్దస్త్ కమెడియన్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *