Headlines

Jabardasth : జబర్దస్త్‏లోకి బాబు మోహన్ ఎంట్రీ.. కామెడీ అన్ లిమిటెడ్.. 41 ఏళ్లల్లో ఎప్పుడూ ఇలా చూడలేదు..

Jabardasth : జబర్దస్త్‏లోకి బాబు మోహన్ ఎంట్రీ.. కామెడీ అన్ లిమిటెడ్.. 41 ఏళ్లల్లో ఎప్పుడూ ఇలా చూడలేదు..


Jabardasth : జబర్దస్త్‏లోకి బాబు మోహన్ ఎంట్రీ.. కామెడీ అన్ లిమిటెడ్.. 41 ఏళ్లల్లో ఎప్పుడూ ఇలా చూడలేదు..

జబర్దస్త్ షోకు బుల్లితెరపై ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ షో ద్వారా ఎంతో మంది నటీనటులు సినీరంగంలోకి అడుగుపెట్టారు. ఇక తాజాగా ఈషోలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఒకప్పటిలాగే జడ్జీగా నాగబాబు రీఎంట్రీ ఇచ్చారు. ఆదివారం ప్రసారం కానున్న ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. అయితే ఈసారి శ్రీనివాసమంగాపురం టీం కూడా వచ్చి సందడి చేసింది. కిరిటీ దామరాజు కూడా స్పెషల్ పర్ఫార్మెన్స్ చేశాడు. అలాగే ఈసారి జబర్దస్త్ షోలోకి బాబు మోహన్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన వేసిన స్కిట్ ను చూసి నాగబాబు, ఇంద్రజ అయితే పడి పడి నవ్వుకున్నారు. బాబు మోహన్ ప్రతీ సారి ప్రాంప్టింగ్ కోసం ప్రయత్నించడం.. డైలాగ్స్ మర్చిపోవడంతో షోలో అందరూ ఒక్కసారిగా నవ్వేశారు.

ఎక్కువమంది చదివినవి :  K. Raghavendra Rao: ఆ హీరోయిన్‏తో 24 సినిమాలు చేశా.. అలాంటి చావు ఎవరికీ రాకూడదు.. డైరెక్టర్ రాఘవేంద్ర రావు..

ఇక రాకింగ్ రాకేష్, బాబు మోహన్ కామెడీ హైలెట్ అయ్యింది. నా 41 ఏళ్ల సినీ కెరీర్ లో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఇలా ప్రాంప్టింగ్ ఎవ్వరూ ఇవ్వలేదు అని బాబు మోహన్ అనడంతో మరింత నవ్వేశారు నాగబాబు. స్కిట్ అనంతరం మీరు రెగ్యులర్ గా యాక్ట్ చేసి ఉంటే ఇంతగా నవ్వు వచ్చేది కాదు.. ఆ ప్రాంప్టింగ్ చెప్పు అని అడిగే తీరు బాగుందంటూ.. నాగబాబు కడుపుబ్బా నవ్వేశాడు. ఇక చివరగా తన స్పెషల్ డైలాగ్ ఎందుకు ఏమిటీ ఎలా అనే డైలాగ్ చెప్పి నవ్వించారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : రూ.16 కోట్లతో తీస్తే 400 కోట్ల కలెక్షన్.. యావత్ దేశమే ఆశ్చర్యపోయేలా చేసిన సినిమా..

జబర్దస్త్ షోలో ఈసారి బాబు మోహన్ ఎంట్రీతోపాటు.. కిరిటీ దామరాజు స్పెషల్ అప్పియరెన్స్ సైతం ప్రేక్షకులను ఆకర్షించనున్నట్లు తెలుస్తోంది. ఇక రాం ప్రసాద్ అండ్ టీం పంచులకు ఇంద్రజ అయితే కడుపుబ్బా నవ్వేశారు. అరేయ్ కాస్త గ్యాప్ ఇవ్వండ్రా అంటూ డైలాగ్ కొట్టింది. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరలవుతుంది.

ఎక్కువమంది చదివినవి : Ramayana Trailer : ఏముందిరా బాబూ.. కుర్రాళ్లు తెగ వెతుకున్న చిన్నది.. రామాయణ ట్రైలర్‏లో తనే స్పెషల్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *