
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) స్వల్పంగా గాయపడ్డారు. ఈరోజు సాయంత్రం ఓ షూంటింగ్‌లో ఆయన భుజానికి గాయమైనట్లు ఎన్టీఆర్ టీమ్ అధికారికంగా వెల్లడించింది. ఆయన ప్రస్తుతం డా. జె. మధుసూదన్ రావు, డా. ఆర్. ఏ. పూర్ణచంద్ర తేజస్వి నేతృత్వంలోని వైద్యుల బృందం ఆద్వర్యంలో చికిత్స పొందుతున్నారని.. పూర్తిగా కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలిపింది.
ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు, శ్రేయోభిలాషులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, కంగారు పడాల్సిన అవసరం లేదని ఎన్టీఆర్ ఆఫీస్ టీమ్ స్పష్టం చేసింది. ఆయన ఆరోగ్యం, కోలుకుంటున్న విధానానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అధికారికంగా ఎప్పటికప్పుడు తెలియజేస్తామని పేర్కొంది.
Ntr
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.