Headlines

Kaaka Movie: మెగాస్టార్ కూతురిగా మలయాళీ క్రేజీ హీరోయిన్.. కాకా నుంచి సర్ ప్రైజింగ్ పోస్టర్ అదిరిపోయింది.. | Malayalam Heroine Anaswara Rajan Play Key Role In Megastar Chiranjeevi Kaaka Movie Poster Released


మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అటు వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర.. అలాగే డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో కాకా చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే కాకా మూవీ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ మూవీ నుంచి సర్ ప్రైజ్ ఇచ్చారు మేకర్స్.ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు చిరంజీవి. ఇటీవలే మన శంకరవరప్రసాద్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇక ఇప్పుడు విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ఇవే కాకుండా ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కాకా’. ఈ చిత్రాన్ని డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ నుంచి టైటిల్ పోస్టర్ రిలీజ్ చేయగా మూవీపై హైప్ క్రియేట్ అయ్యింది. తాజాగా ఈ మూవీ నుంచి సర్ ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. మలయాళ భామ, ప్రముఖ నటి అనస్వర రాజన్ ఒక కీలకమైన పాత్రలో నటించనుంది. ఇందులో ఆమె చిరంజీవి కుమార్తె పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా చిత్రబృందం సోమవారం అనస్వర రాజన్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అధికారికంగా విడుదల చేసింది.

ఈ సినిమాలో అనస్వర రాజన్ ‘అమ్ములు’ అనే పాత్రలో కనిపించనుంది. విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో అనస్వర ఎంతో పద్ధతిగా, సాంప్రదాయ దుస్తుల్లో నాచురల్ లుక్‌తో ఆకట్టుకుంటోంది. ఆమె లుక్ సోషల్ మీడియాలో నెటిజన్లను, మెగా అభిమానులను విశేషంగా ఆకర్షిస్తోంది. కొద్దిసేపట్లోనే ఈ పోస్టర్ సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్‌గా మారింది. ‘నేరుపే’, ‘ప్రేమలు’ వంటి చిత్రాలతో టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న అనస్వర రాజన్, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి వంటి దిగ్గజ నటుడితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆమె కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలవనుంది. తండ్రీకూతుళ్ల మధ్య ఉండే భావోద్వేగాలు ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని, అనస్వర పాత్ర కథను మలుపు తిప్పే విధంగా ఉంటుందని సమాచారం.

ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తుండగా, భారీ బడ్జెట్ , అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మిస్తున్నారు. మెగాస్టార్ కాకా లుక్ ఇప్పటికే మంచి అంచనాలను పెంచగా, తాజాగా విడుదలైన ‘అమ్ములు’ పోస్టర్ సినిమాపై అంచనాలను మరింత రెట్టింపు చేసింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ వేగంగా జరుగుతోంది. అభిమానులు ఈ క్రేజీ కాంబినేషన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఎక్కువమంది చదివినవి : Bigg Boss 10 Telugu : లక్షలు ఇస్తామన్నా వద్దన్నారు.. బిగ్ బాస్ 10 ఆఫర్ రిజెక్ట్ చేసిన సెలబ్రిటీస్ వీళ్లే..

అనస్వర రాజన్..

ఎక్కువమంది చదివినవి : Actor: ఒకప్పుడు కెమిస్ట్‌గా, వాచ్‌మన్‌గా పనిచేసి.. ఇప్పుడు తోపు నటుడు.. 200 కోట్లకు అధిపతి..



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *