Headlines

Ration Card: రేషన్ కార్డు ఈకేవైసీ ఇంకా పూర్తి చేయలేదా..? ఈ యాప్‌లో ముఖం చేపిస్తే చాలు.. సెకన్లలోనే అంతా పినిష్.. | Ration Card e KYC: No Need to Visit Ration Shop, Complete KYC Online from Home


రేషన్ కార్డు ఉన్నవారు తమ ఈకేవైసీని పూర్తి చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. రేషన్ కార్డుల్లో దుర్వినియోగాన్ని అరికట్టడం, బ్లాక్ మార్కెటింగ్‌ను అడ్డుకోవడం, నిజమైన లబ్దిదారులకు మాత్రమే రేషన్ అందేలా చేయడంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈకేవైసీ పూర్తి చేసేందుకు మీరు రేషన్ షాపుల చుట్టూ తిరగాల్సిన పని లేదు. రేషన్ డీలర్ల అవసరం కూడా లేదు. ఇందుకోసం ఏ ప్రభుత్వ కార్యాలయం చుట్టూ కూడా తిరగాల్సిన పని లేదు. ఇంట్లోనే ఉండి మొబైల్ ద్వారా ఈ ప్రక్రియ సులువుగా పూర్తి చేయవచ్చు. ఈ విషయం చాలామంది తెలియక రేషన్ షాపుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. కొంతమంది మీ సేవ కేంద్రాల చుట్టూ కేవైసీ కోసం తిరుగుతుంటారు. ఆ అవసరం లేకుండా మొబైల్ ద్వారా రెండు నిమిషాల్లోనే కేవైసీ పూర్తి చేసుకోవచ్చు.

ఈ యాప్ ఒక్కటి ఉంటే చాలు

కేంద్ర ప్రభుత్వం మేరా రేషన్ అనే యాప్ అందుబాటులోకి తెచ్చింది. యాప్‌లో మీ రేషన్ కార్డుకు సంబంధించిన వివరాలతో పాటు కేవైసీ కూడా కంప్లీట్ చేయవచ్చు. మీ రేషన్ కార్డు డిజిటల్ కాపీ డౌన్ లోడ్ చేసుకోవడం, మార్పులు, చేర్పులు చేసుకోవడం, ఇప్పటివరకు ఎంత రేషన్ తీసుకున్నారనే వివరాలు తెలుసుకునే సదుపాయం ఉంది. మీరు కేవైసీ ఇదే యాప్ ద్వారా చేసుకోచ్చు. మేరా రేషన్ యప్, ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ ఉంటే సరిపోతుంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ రెండు యాప్స్‌ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

రేషన్ కార్డు ఈకేవైసీ పూర్తి చేయడం ఎలా..?

-మేరా రేషన్ యాప్ డౌన్ లోడ్ చేసుకోండి

-యాప్ ఓపెన్ చేశాక మీ రాష్ట్రాన్ని ఎంచుకోండి

-అనంతరం మీ రేషన్ కార్డు నెంబర్, క్యాప్చా నమోదు చేయండి

-ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయండి

-ఆ తర్వాత ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ సాయంతో మీ ఫేస్ కెమెరా స్క్రీన్‌కు చూపించండి

-కళ్లు బ్లింక్ చేయడం ద్వారా స్కాన్ సులువుగా పూర్తవుతుంది

-ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత స్క్రీన్‌పై సక్సెస్ అని కనిపిస్తే మీ కేవైసీ పూర్తయినట్లు అర్థం చేసుకోవచ్చు.

ఆఫ్‌లైన్ ద్వారా చేసుకోవడం ఎలా..?

మీ సమీపంలోని ఏదైనా రేషన్ షాపుకు వెళ్లి మీ రేషన్ కార్డు అందించండి. డీలర్ వద్ద ఉండే బయోమెట్రిక్ మెషిన్ ద్వారా మీ వేలిముద్రలు అందించడం వల్ల ఈకేవైసీ పూర్తవుతుంది. అలాగే సమీపంలోని మీ సేవా కేంద్రానికి వెళ్లి అయినా పూర్తి చేయవచ్చు. రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతీఒక్కరూ ఈ ప్రక్రియను పూర్తి చేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *