Headlines

Kiran Abbavaram: మా కోసం స్నాక్స్ తీసుకురావడానికి వెళ్లి.. అన్నయ్య మరణాన్ని తల్చుకుని కిరణ్ అబ్బవరం కన్నీళ్లు | Kiran Abbavaram Gets Emotional While Remembering His Brother Tragic Death In Road Accident

Kiran Abbavaram: మా కోసం స్నాక్స్ తీసుకురావడానికి వెళ్లి.. అన్నయ్య మరణాన్ని తల్చుకుని కిరణ్ అబ్బవరం కన్నీళ్లు | Kiran Abbavaram Gets Emotional While Remembering His Brother Tragic Death In Road Accident


క, కే- ర్యాంప్ వంటి సూపర్ హిట్స్ తర్వాత హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ సినిమా ‘చెన్నై లవ్‌స్టోరీ’. రవి నంబూరి తెరకెక్కించిన ఈ ప్రేమకథా చిత్రంలో తెలుగమ్మాయి శ్రీ గౌరి ప్రియ హీరోయిన్ గా నటించింది. కలర్ ఫొటో, బేబీ సినిమాలతో జాతీయ అవార్డు అందుకున్న సాయి రాజేష్ ఈ సినిమాకు కథ, స్క్రీన ప్లే అందించారు. జులై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ రాబడుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ శ్రీ గౌరిప్రియతో పాటు చిత్ర బృందమంతా ఈ వేడుకకు హాజరైంది. అలాగే అక్కినేని నాగ చైతన్య ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందానికి అభినందనలు తెలిపాడు. కాగా ఇదే కార్యక్రమంలో మాట్లాడిన కిరణ్ అబ్బవరం తన జీవితంలో జరిగిన ఓ తీవ్ర విషాదాన్ని బయట పెట్టాడు. ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాలో హీరో కిరణ్ అబ్బవరం ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోతాడు. అయితే ఇలాంటి విషాదం తన నిజ జీవితంలోనూ జరిగిందని ఎమోషనల్ అయ్యాడు కిరణ్. తన అన్నయ్య ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని గుర్తు చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడీ యంగ్ హీరో.

‘దర్శకుడు రవి నాకు ఈ సినిమా ఇంటర్వెల్ సీన్ కథ చెప్పినప్పుడు నాకు మా సొంత అన్నయ్య గుర్తుకొచ్చాడు. చిన్నప్పుడు మాకు స్నాక్స్ తీసుకురావడానికి బయటకు వెళ్లి, తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో మా అన్నయ్య మరణించాడు. ఈ కథ విన్నప్పుడు ఆ సంఘటన కళ్లముందు మెదిలింది. అయితే సినిమా షూటింగ్ సమయంలో లేదా స్టోరీ డిస్కషన్ లో ఎక్కడా కానీ నేను ఈ విషయం చెప్పలేదు . ఈ విజయోత్సవ వేడుకలోనే అందరితో పంచుకోవాలని అనుకున్నాను, అందుకే ఇప్పుడు చెబుతున్నాను” అని వేదికపైనే కంటతడి పెట్టాడు కిరణ్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి



వీడియో ఇదిగో..

కాగా కిరణ్ అబ్బవరం అన్నయ్య పేరు రామాంజులు రెడ్డి. కొన్నేళ్ల క్రితం కడప జిల్లా చెన్నూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. మార్గమధ్యంలోనే రామాంజులు కన్నుమూశాడు. ఇప్పుడిదే విషయాన్న గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యాడు కిరణ్ అబ్బవరం.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *