Headlines

KL Rahul  : సచిన్, ధోనీ, కోహ్లీ వల్ల కూడా కాలేదు.. అరుదైన ఘనత సాధించేందుకు సిద్ధమైన కేఎల్ రాహుల్ | 10,000 Runs Without Bowling a Single Ball KL Rahul Set to Make History in Indian Cricket

KL Rahul  : సచిన్, ధోనీ, కోహ్లీ వల్ల కూడా కాలేదు.. అరుదైన ఘనత సాధించేందుకు సిద్ధమైన కేఎల్ రాహుల్ | 10,000 Runs Without Bowling a Single Ball KL Rahul Set to Make History in Indian Cricket


KL Rahul  : భారత క్రికెట్ జట్టు శ్రీలంకతో ఆగస్టు 15 నుంచి రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియా ఒక ప్రాక్టీస్ మ్యాచ్‌లో కూడా పాల్గొననుంది. సిరీస్‌లోని మొదటి మ్యాచ్ చారిత్రాత్మక గాళ్లే ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుండగా, రెండో టెస్టు కోలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరగనుంది. ఈ టెస్ట్ సిరీస్ భారత స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ కేఎల్ రాహుల్‌కు చాలా ప్రత్యేకమైనదిగా మారనుంది. ఎందుకంటే భారత క్రికెట్ చరిత్రలోనే ఏ ఆటగాడికీ సాధ్యంకాని ఒక వినూత్న రికార్డును ఆయన తన పేరిట లిఖించుకోబోతున్నారు.

కేవలం 170 పరుగుల దూరంలో..

కేఎల్ రాహుల్ అంతర్జాతీయ క్రికెట్‌లో 10,000 పరుగులు పూర్తి చేసుకోవడానికి కేవలం 170 పరుగుల దూరంలో ఉన్నారు. రాహుల్ ఇప్పటివరకు మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తం 9,830 పరుగులు సాధించారు. రాబోయే శ్రీలంక సిరీస్‌లో మరో 170 పరుగులు సాధిస్తే, అంతర్జాతీయ క్రికెట్‌లో 10 వేల పరుగుల మైలురాయిని అందుకున్న ప్రత్యేక భారత బ్యాటర్ల జాబితాలో చేరతారు. ఈ రికార్డులోని అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. అంతర్జాతీయ క్రికెట్‌లో తన కెరీర్‌లో ఒక్క బంతి కూడా బౌలింగ్ చేయకుండా 10,000 పరుగుల మైలురాయిని దాటిన తొలి భారతీయ ఆటగాడిగా కేఎల్ రాహుల్ నిలుస్తారు!

దిగ్గజాలకు కూడా సాధ్యంకాని అరుదైన రికార్డు

సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, ఎమ్ఎస్ ధోనీ, రోహిత్ శర్మ వంటి టీమిండియా దిగ్గజ బ్యాటర్లందరూ తమ అంతర్జాతీయ కెరీర్‌లో ఏదో ఒక సమయంలో కొన్ని ఓవర్లయినా బౌలింగ్ చేశారు. కానీ కేఎల్ రాహుల్ మాత్రం ఇప్పటివరకు తన కెరీర్‌లో అంతర్జాతీయ స్థాయిలో ఒక్క బంతి కూడా వేయలేదు. అసలు బౌలింగే చేయకుండా భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో కేఎల్ రాహుల్ ఇప్పటికే అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.

* కేఎల్ రాహుల్: 9,830 పరుగులు

* అజింక్య రహానే: 8,414 పరుగులు

* రిషభ్ పంత్: 5,637 పరుగులు

* ఇషాన్ కిషన్: 2,793 పరుగులు

* ఫారూఖ్ ఇంజనీర్: 2,725 పరుగులు

మూడు ఫార్మాట్లలో కేఎల్ రాహుల్ అద్భుత కెరీర్

కేఎల్ రాహుల్ టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. ఇప్పటివరకు 68 టెస్టు మ్యాచ్‌లలోని 119 ఇన్నింగ్స్‌లలో 36.42 సగటుతో 4,153 పరుగులు చేశారు. ఇందులో 12 సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక వన్డేల్లో 98 మ్యాచ్‌లలోని 90 ఇన్నింగ్స్‌లలో 49.44 సగటుతో 3,412 పరుగులు సాధించారు. ఇందులో 8 సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టి20 అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా 72 మ్యాచ్‌లు ఆడి 2,265 పరుగులు సాధించారు. ఈ ఫార్మాట్‌లో ఆయన పేరిట 2 సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు నమోదు కావడం గమనార్హం.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *