Headlines

Mrunal Thakur: ఆ హీరో నా జీవితాన్నే మార్చేశాడు.. అతని వల్లే ఇప్పుడు ఇలా ఉన్నా.. : మృణాల్ ఠాకూర్ | Mrunal Thakur credited Akshay Kumar for helping her overcome intense body shaming

Mrunal Thakur: ఆ హీరో నా జీవితాన్నే మార్చేశాడు.. అతని వల్లే ఇప్పుడు ఇలా ఉన్నా.. : మృణాల్ ఠాకూర్ | Mrunal Thakur credited Akshay Kumar for helping her overcome intense body shaming


టాలీవుడ్ లో తక్కువ సమయంలోనే పాపులర్ అయినా హీరోయిన్స్ లో ముందు వరసలో ఉంటుంది మృణాల్ ఠాకూర్. బాలీవుడ్ నుంచి వచ్చిన ఈ చిన్నది తెలుగులో తొలి సినిమాతోనే భారీ హిట్ అందుకుంది. అంతే కాదు అదే సినిమాలో తన అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. నేడు ఈ చిన్నదాని పుట్టిన రోజు. మృణాల్ ఠాకూర్ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులు పెద్దెత్తున ఆమెకు విషెస్ తెలుపుతూ పోస్ట్ లు షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె గతంలో చేసిన కామెంట్స్, ఆమెకు సంబందించిన కొన్ని క్రేజీ వార్తలు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే గతంలో ఆమె తనకు ఓ హీరో చేసిన సాయం గురించి కూడా మాట్లాడింది.

ఇది కూడా చదివేయండి : రోజుకు 3లక్షలు రెమ్యునరేషన్.. మంచంపై నోట్ల కట్టలు పరుచుకుని పడుకునేది.. చివరకు అనాధలా చనిపోయింది

మొన్నటివరకు తెలుగులో వరుసగా సినిమాలు చేసిన మృణాల్.. ఇప్పుడు సినిమాల స్పీడ్ తగ్గించింది. సీతారామంతో ను టాలీవుడ్ ను పలకరించింది మృణాల్. తర్వాత వెంటనే హాయ్ నాన్న సినిమా చేసింది. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.  తర్వాత విజయ్ దేవరకొండతో కలిసి సినిమా చేసింది. ఫ్యామిలీ స్టార్ అనే సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దాంతో చిన్న గ్యాప్ తీసుకొని కల్కిలో ఓ చిన్న రోల్ చేసింది. ఆతర్వాత డెకాయిట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది.

ఇవి కూడా చదవండి



ఇది కూడా చదివేయండి : అతనికి 29, ఆమెకు 53..! 6 ఏళ్లుగా ఓటీటీని షేక్ చేస్తున్న రొమాంటిక్ సిరీస్.. ఎక్కడ చూడొచ్చంటే

కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో మృణాల్ మాట్లాడుతూ.. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ చెప్పిన మాటలు తన జీవితాన్నే మార్చేశాయని తెలిపింది. మొదట్లో శరీరం పై వచ్చిన విమర్శలకు చాలా బాధపడ్డానని.. ఆ కామెంట్స్ ను తట్టుకోలేక పోయేదాన్ని విపరీతంగా ఏడ్చేసేదాన్ని. అలా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను.. అదేసమయంలో తన జీవితంలో అక్షయ్ కుమార్ ఇచ్చిన సలహా ఎంతో మార్పు తెచ్చిందని మృణాల్ తెలిపింది. నిన్ను నువ్వుగా అంగీకరించు. ఇతరుల మాటల కోసం మారాల్సిన అవసరం లేదు. ఒక పాత్ర కోసం అవసరమైతే మాత్రమే మారాలి అని అక్షయ్ చెప్పారని ఆ మాటలు తన జీవితాన్ని మార్చేశాయి అని.. అప్పటినుంచి తనకు నచ్చినట్టు, సంతోషంగా బ్రతుకుతున్నా అని  తెలిపింది మృణాల్. ప్రస్తుతం మృణాల్ తెలుగుతో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. త్వరలోనే ఈ అమ్మడు తమిళ్ లోనూ ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తుంది.

ఇది కూడా చదివేయండి : చేతులారా జీవితాన్ని నాశనం చేసుకున్నాడు.. పెద్ద హీరో అవుతానుకుంటే.. 38ఏళ్ల వయసులోనే చనిపోయాడు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *