Headlines

Mukesh Ambani: ముఖేష్ అంబానీ మనవడు ఏ స్కూల్‌లో చదువుతున్నాడో తెలుసా? ఫీజు ఎంతో తెలిస్తే మైండ్‌ బ్లాంకే..! | Do you know which school Mukesh Ambani’s grandson studies at? Wait till you hear the fee it’ll blow your mind

Mukesh Ambani: ముఖేష్ అంబానీ మనవడు ఏ స్కూల్‌లో చదువుతున్నాడో తెలుసా? ఫీజు ఎంతో తెలిస్తే మైండ్‌ బ్లాంకే..! | Do you know which school Mukesh Ambani’s grandson studies at? Wait till you hear the fee it’ll blow your mind


Mukesh Ambani: ముఖేష్‌ అంబానీ.. పేరు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన ముఖేష్‌ అంబానీ ఎప్పుడు వార్తల్లో ఉంటారు. అయితే ముఖేష్‌ అంబానీ- నీతా అంబానీలకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు. పెద్ద కొడుకు ఆకాష్ అంబానీ కొడుకు పృథ్వీ అంబానీ. పృథ్వీ అంబానీ వయసు ఇప్పుడు ఆరేళ్లు. అయితే అంబానీ మనవడు పృథ్వీ ఇప్పుడు ఏ స్కూల్లో చదువుతున్నాడో తెలుసా?

అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ముఖేష్ అంబానీ పెద్ద మనవడు పృథ్వీ అంబానీ చదువుతున్న పాఠశాల వివరాలు, ఆ స్కూల్ ఫీజుల గురించిన వార్తలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆసియా కుబేరుడి మనవడు అంటే ఆ మాత్రం రేంజ్ ఉండటం సహజమే అయినప్పటికీ, ఆ స్కూల్ ఫీజుల గురించి తెలుసుకున్న సామాన్యులు మాత్రం ఆశ్చర్యపోతున్నారు.

ఇది కూడా చదవండి: Indian Railways: కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం!

అంబానీ మనవడు ఏదో సాధారణ స్కూల్‌లో చదవడం లేదు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో, అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ స్కూల్‌లో విద్యనభ్యసిస్తున్నాడు. పృథ్వీ అంబానీ ప్రస్తుతం తమ సొంత స్కూల్లోనే చదువుతున్నాడు. ఆ స్కూల్ పేరు ‘నీతా ముఖేశ్ అంబానీ జూనియర్ స్కూల్’. ఈ పాఠశాలకు ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయమైన కరికులమ్ సంస్థ ‘ఇంటర్నేషనల్ బాకలారియేట్ వరల్డ్ స్కూల్’ గుర్తింపు ఉంది. NMAJS స్కూల్‌లో పిల్లల ప్రాథమిక విద్య ‘ప్రైమరీ ఇయర్స్ ప్రోగ్రామ్’ తో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ‘మిడిల్ ఇయర్స్ ప్రోగ్రామ్’ కూడా ఇక్కడే అందిస్తారు. ఈ స్కూల్‌కు ముంబైలో రెండు భారీ, అత్యాధునిక క్యాంపస్‌లు ఉన్నాయి. ఒకటి బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లో, మరొకటి జియో వరల్డ్ సెంటర్ ప్రాంగణంలో ఉంది. ఈ రెండు స్కూళ్లలో బాలీవుడ్ హీరో హీరోయిన్ల పిల్లలు చదువుతున్నారు.

స్కూలు ఫీజు ఎంత ఉంటుంది?

ముఖేష్ అంబానీ మనవడి స్కూలు ఫీజు తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు. జూనియర్ స్కూల్ తరగతిని బట్టి సుమారు రూ.14 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. అంటే పృథ్వీ అంబానీ స్కూలు ఫీజు అక్షరాల రూ.14 లక్షలకుపైనే ఉంటుంది. ఈ ‘నీతా ముకేశ్ అంబానీ జూనియర్ స్కూల్’, ‘ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్’ (DAIS)లో ఒక భాగం. ఇండియాలోనే నంబర్ వన్ ఇంటర్నేషనల్ స్కూల్‌గా ధీరూభాయ్ అంబానీ స్కూల్ పేరు సాధించింది. మరి కేవలం ప్రాథమిక విద్యకే ఇంత భారీ స్థాయిలో స్కూల్‌ ఫీజులు ఉంటే ఇంకా పై తరగతులకు ఎంత ఫీజు ఉంటుందో ఊహించుకుంటేనే ఆశ్చర్యమేస్తోంది.

ఇది కూడా చదవండి: New Ration Rules: ఆ రేషన్ కార్డుదారులకు కేంద్రం బిగ్ అప్‌డేట్.. ప్రతి వ్యక్తికి 7 కిలోల బియ్యం!

ఇది కూడా చదవండి: Indian Railways: రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *