Headlines

Oil-Free Poori: నూనెతో పనిలేదు.. సింపుల్‌గా ఇంట్లోనే ఆయిల్‌ ఫ్రీ పూరీలు ఎలా చేయాలో తెలుసుకోండి! | How to Make Oil Free Poori at Home in Pressure Cooker: Check the recipe process

Oil-Free Poori: నూనెతో పనిలేదు.. సింపుల్‌గా ఇంట్లోనే ఆయిల్‌ ఫ్రీ పూరీలు ఎలా చేయాలో తెలుసుకోండి! | How to Make Oil Free Poori at Home in Pressure Cooker: Check the recipe process


మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా, లేదా ఏవైనా పండగలు వచ్చినా ఇంట్లో పూరీలు చేసుకుని తినేందుకు చాలా మంది ఇష్టపడుతారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే పూరీలను ఎక్కవగా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి తింటూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది ఆరోగ్యంపై శ్రద్ద పెడుతున్నారు. ఈ క్రమంలో తినాలని ఇష్టం ఉన్నప్పటికీ ఆయిల్‌లో వేయించడం కారణంగా పూరీలను తినలేకపోతున్నారు. కానీ ఇకపై మీరు ఆ పని చేయాల్సిన ఆవసరం లేదు. ఎందుకంటే చుక్క ఆయిల్ కూడా లేకుండానే ఇప్పుడు మనం పూరీలు చేసుకోవచ్చు.

అవును మీ ఇంట్లో ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. దీని సహాయంతోనే ఒక్క బొట్టు నూనె కూడా లేకుండా పొంగే, రుచికరమైన పూరీలను ఎలా తయారు చేసుకోవచ్చు. అదెలానో స్టెప్‌బై స్టెప్ ఇక్కడ వివరంగా చూద్దాం.

ఆయిల్ ఫ్రీ పూరీలకు కావలసిన పదార్థాలు:

  • గోధుమ పిండి: 2 కప్పులు
  • వాము: ½ టీస్పూన్
  • ఉప్పు: రుచికి సరిపడా
  • గోరువెచ్చని నీరు: పిండి కలపడానికి సరిపడా

ఆయిల్ ఫ్రీ పూరీల తయారీ విధానం:

మొదటగా ఒక వెడల్పాటి పాత్రలో గోధుమ పిండి, ఉప్పు, వాము వేసి వేసుకోండి. అందులో కొద్దికొద్దిగా గోరువెచ్చని నీరు పోస్తూ పిండిని గట్టిగా చపాతీ పిండి కంటే కొద్దిగా గట్టిగా కలుపుకోండి. తర్వాత కలిపిన పిండిపై మూతపెట్టి 10 నుండి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఇలా చేయడం ద్వారా పిండి సరిగ్గా నాని, రుద్దేటప్పుడు పూరీలు విరిగిపోవు. ఇక నానిన పిండిని మళ్లీ ఒకసారి బాగా పిసికి, చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి. చపాతీ కర్రతో వాటిని పూరీల సైజులో రుద్దుకోండి.

ఇప్పుడు గ్యాస్ మీద ప్రెజర్ కుక్కర్ పెట్టి అందులో 1 నుండి 2 గ్లాసుల నీళ్లు పోయండి. అలాగే కుక్కర్ అడుగున ఒక స్టాండ్ ఉంచండి. ఇప్పుడు ఒక స్టీలు ప్లేట్ తీసుకొని, పూరీలు అతుక్కోకుండా ఉండటానికి దానికి కొంచెం నూనె లేదా నెయ్యి రాయండి. ఇప్పుడు మీరు రుద్ది పెట్టుకున్న పూరీలను ఆ ప్లేట్‌లో ఉంచి, ఆ ప్లేట్‌ను నీటికి తగలకుండా కుక్కర్‌లోని స్టాండ్‌పై పెట్టండి. తర్వాత కుక్కర్ మూత పెట్టండి, కానీ దానికి విజిల్ పెట్టకండి. హై ఫ్లేమ్‌పై సుమారు 3 నుండి 4 నిమిషాల పాటు పూరీలను ఆవిరిపై ఉడకనివ్వండి.

3-4 నిమిషాల తర్వాత కుక్కర్ మూత తీస్తే బాగా పొంగిన పూరీలు మీకు కనిపిస్తాయి. అంతే నేనె లేకుండా మీకు వేడి వేడిగా పొంగే పూరీలు రెడీ అయినట్టు. వాటిని ఆలు కుర్మా లేదా శనగపిండి సాగు, లేదా పల్లి చట్నీతో లింటే టేస్ట్ అదిరిపోతుంది. నూనే లేని పూరీలను తినాలి అనుకునే వారికి ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

ఆయిల్ ఫ్రీ పూరీల ప్రయోజనాలు

ఈ ఆయిల్ ఫ్రీ పూరీల వల్ల మనకు ఆనేక ప్రయోజనాలు ఉన్నాయి. పూరీలను నూనెలో వేయించకపోవడం వల్ల వీటిలో కొవ్వు, క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. గుండె జబ్బులు, హై కొలెస్ట్రాల్ లేదా బరువు తగ్గాలనుకునే వారికి ఈ పద్ధతి ఎంతగానో ఉపయోగపడుతుంది. నూనె లేకపోయినా ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అయితే ఈ రెసిపీ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌గా మారుతోంది. కానీ కొందరుమాత్రం ఇది ప్రాక్టికల్‌గా పాజిబుల్‌ కాదు అని చెబుతున్నారు.

Note: అయితే పైర్కొన్న విధంగా ఆయిల్ ప్రెజర్ కుక్కర్ ద్వారా పూరీలు తయారు చేసుకోవచ్చని సోషల్‌ మీడియాలో చెబుతున్నప్పకి.. ప్రాక్టికల్‌ కావట్లేదనే వాదన కూడా ఉంది. కాబట్టి దీనిని నిపుణుల సలహా మేరకు మాత్రమే.. ఈ రెసిపీని ట్రై చేయండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *