Headlines

OTT Movie: ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది.. తల్లులందరూ తప్పక చూడాల్సిన మూవీ | Taapsee Pannu Gandhari Movie Is Streaming On Netflix OTT, Telugu Version Also Available


ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీలోనూ కొత్త సినిమాలు సందడి చేయనున్నాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు ఆడియెన్స్ కు వినోదం పంచేందుకు రెడీ అయ్యాయి. ఇప్పటికే పళ్ల బురుసు, హాలీవుడ్ సినిమా ది రన్నర్, అనంతన్ కాడు వంటి సినిమాలు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. ఇక శుక్రవారం (సెప్టెంబర్ 04)న వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు, లోకేశ్ కనగరాజ్ డీసీ, మాధవన్ జీడీఎన్, ఉన్మాదం తదితర సినిమాలతో పాటు జగమే సంగీతం, ద కోర్ట్ లాంటి వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కు రానున్నాయి. అయితే గురువారం నుంచే ఓ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్‌గా మంచి క్రేజ్ సంపాదించుకున్న తాప్సీ నటించిన ఈ సినిమా పేరు గాంధారి. హై-వోల్టేజ్ ఎమోషనల్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కిన ఈ సినిమాకు దేవాశిష్ మఖీజా దర్శకత్వం వహించారు. హసీన్ దిల్‌రుబా’, ‘ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రుబా’, ‘మన్మర్జియా’ వంటి సూపర్ హిట్ సినిమాలకు కథ అందించిన కనికా ధిల్లాన్ ఈ మూవీకి కూడా స్టోరీ అందించారు. తాప్పీ కూతురిగా మైరా శివన్ నటించగా, ఈశ్వక్ సింగ్, ఛాయా కదమ్, స్వస్తిక ముఖర్జీ, మితా వశిష్ట్, జతిన్ సర్నా, ప్రశాంత్ నారాయణన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

గాంధారి సినిమా కథ విషయానికి వస్తే.. ఇదొక సర్వైవల్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్. ‘బాణి’ (తాప్సీ) అనే తల్లి చుట్టూ ఈ కథ తిరుగుతుంది
ఒకసారి రద్దీగా ఉండే ఒక రైల్వే స్టేషన్‌లో ఆమె కూతురు హఠాత్తుగా మాయమవుతుంది. దీంతో బాణి తన కూతురిని కాపాడుకునేందుకు నడుం బిగిస్తుంది. ఇదే క్రమంలో ఆమెపై దారుణమైన దాడి జరుగుతుంది. దీంతో బాణి కంటి చూపు పోతుంది. మరి కంటి చూపు లేకపోయినా, శరీరం సహకరించకపోయినా తన కూతురును కాపాడుకునేందుకు చేసిన పోరాట ఇతివృత్తమే గాంధారి సినిమా. చైల్డ్ ట్రాఫికింగ్ (పిల్లల అక్రమ రవాణా) నెట్‌వర్క్, అలాగే పేరుకుపోయిన క్రిమినల్ గ్యాంగ్‌ను ఎదురించే క్రమంలో ఆమె ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నదో తెలుసుకోవాలంటే ఈ గాంధారి సినిమా చూడాల్సిందే. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, ఇంగ్లీష్ తదితర భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి



నెట్ ఫ్లిక్స్ లో గాంధారి..

గాంధారి సినిమా ట్రైలర్..



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *