Headlines

OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన హాలీవుడ్ సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు | Gal Gadot Starrer The Runner Movie Is Streaming Now In Telugu Also On Amazon Prime Video OTT


ఎప్పటిలాగే ఈ వారం కూడా థియేటర్లతో పాటు ఓటీటీలోనూ కొత్త సినిమాలు సందడి చేయనున్నాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు వివిధ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ లో సందడి చేయనున్నాయి. ఇప్పటికే అక్కినేని నాగార్జున నిర్మించిన పళ్ల బురుసు సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో పాటు వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు, లోకేశ్ కనగరాజ్ డీసీ, మాధవన్ జీడీఎన్, ఉన్మాదం, గాంధారి వంటి సినిమాలతో పాటు జగమే సంగీతం, ద కోర్ట్ లాంటి వెబ్ సిరీసులు ఈ వీకెండ్ లోనే స్ట్రీమింగ్ కు రానున్నాయి. అయితే వీటికంటే ముందే ఒక హాలీవుడ్ సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేసింది. బుధవారం (సెప్టెంబర్ 02) నుంచే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమంగ్ ప్లాట్ ఫామ్ లో ప్రత్యక్షమైంది. అది కూడా ఎలాంటి ముందస్తు థియేట్రికల్ రిలీజ్ లేకుండా నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా పేరు ‘ది రన్నర్’ (The Runner). ‘వండర్ వుమెన్’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన గాల్ గాడోట్ ఈ సినిమాలో మెయిన్ లీడ్ పోషించింది.

ప్రముఖ దర్శకుడు కెవిన్ మెక్‌డొనాల్డ్ తెరకెక్కించిన ది రన్నర్ సినిమా డైరెక్టుగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. లండన్ నేపథ్యంగా సాగే ఈ ఇంటెన్స్ యాక్షన్ డ్రామా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. గాల్ గాడోట్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఇంగ్లిష్ తో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ ది రన్నర్ సినిమా అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *