Headlines

OTT Movie: ఓటీటీలో దుమ్మురేపుతోన్న మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్.. టాప్‌లో ట్రెండింగ్.. IMDBలోనూ టాప్ రేటింగ్ | Must Wach Movie In OTT: Mystery Crime Thriller Babita Singh Reporting Is Now Trending Top On Amazon Prime Video


ఈ వారం థియేటర్లతో పాటు ఓటీటీల్లోనూ పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు, లోకేశ్ కనగరాజ్ డీసీ, పళ్ల బురుసు, తాప్పీ గాంధారి, మాధవన్ జీడీఎన్, ఉన్మాదం, , ది రన్నర్, అనంతన్ కాడు వంటి సినిమాలతో పాటు జగమే సంగీతం, ద కోర్ట్ లాంటి వెబ్ సిరీస్ లు ప్రస్తుతం ఓటీటీ ఆడియెన్స్ కు వినోదం అందిస్తున్నాయి. అయితే వీటితో పాటు కొన్ని రోజుల క్రితమే ఓటీటీలోకి వచ్చిన ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీ టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఓటీటీలో భారీ వ్యూస్ సాధిస్తోంది. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. సోషల్ మీడియాలోనూ ఈ సినిమాకు మంచి రేటింగ్స్ వస్తున్నాయి. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. బేబీ అనే ఓ లేడీ పోలీస్ ఆఫీస్ చుట్టూ ఈ కత తిరుగుతుంది. ఇల్లు, ఉద్యోగం రెండింటినీ బ్యాలెన్స్ చేయలేక ఇబ్బందులు పడుతుంటుంది. ఇదే క్రమంలో బేబీకి ఒక కుటుంబ కార్యక్రమం కోసం సెలవు అవసరం అవుతుంది. దీని కోసం ఆమె ఒక బూటకపు కేసును మీద వేసుకుని సస్పెండ్ అవుతుంది. ఆ తర్వాత తన సొంతూరైన మధ్యప్రదేశ్‌లోని రేవాకు వెళ్తుంది. అక్కడ ఆమెకు తన చిన్ననాటి స్నేహితుడు బన్సీ ఎదురవుతాడు. అయితే అదే రాత్రి బన్సీ హత్యకు గురవడంతో పరిస్థితి మొత్తం మారిపోతుంది. స్థానిక పోలీసులు సహకరింకచకపోవడంతో బేబీ స్వయంగా ఈ హత్య కేసును దర్యాప్తు చేయాలని నిర్ణయించుకుంటుంది. ఈ దర్యాప్తు సమయంలో, ఆమెకు సంచలన విషయాలు తెలుస్తాయి. మరి బన్సీని ఎవరు హత్య చేశారు? బేబీ ఈ కేసును ఎలా పరిష్కరించిందన్నదే ఈ సినిమా మెయిన్ పాయింట్. ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే, ఇది కేవలం ఒక హత్య కేసును దర్యాప్తు చేసే చిత్రం మాత్రమే కాదు. ఇది ఒక మహిళా పోలీస్ అధికారి వ్యక్తిగత జీవితంలోని సంఘర్షణను కూడా ఆవిష్కరిస్తుంది. అలాగే ఇంట్లో భర్త, అత్తమామల వేధింపులు, పని చేసే చోట పురుషాధిక్య భావజాలం వంటి ఎన్నో అంశాలను ఈ సినిమాలో చక్కగా చూపించారు.

ప్రస్తుతం ఓటీటీలో ట్రెండింగ్ లో ఉన్న ఈ సినిమా పేరు ‘బబితా సింగ్‌ రిపోర్టింగ్‌’ (Babita Singh Reporting). ఇందులో బేబీ పాత్రను పోషించిన నిమిషా సజయాన్ నటన విశేషంగా ప్రశంసలు అందుకుంటోంది. అలాగే బరున్ సోబ్తి పాత్ర పరిమితమైనప్పటికీ, అతను దానికి పూర్తి న్యాయం చేశాడు. అన్షుమాన్ పుష్కర్, రాజేష్ కుమార్ అద్భుతంగా నటించారు. ఈ సినిమా ప్రారంభం ఆసక్తికరంగా ఉంటుంది. అసలు హత్య ఎవరు చేశారు, దాని వెనుక కారణం ఏమిటి, దర్యాప్తు చేసేటప్పుడు బేబీ ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటుంది వంటి విషయాలు ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తాయి. ‘బబితా సింగ్ రిపోర్టింగ్’ చిత్రం 28 ఆగస్టు అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. ప్రస్తుతం ఇది టాప్ లో ట్రెండ్ అవుతోంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా కేవలం హిందీ ఆడియోతో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో ఈ సినిమాను ఎంజాయ్ చేయవచ్చు.

బబితా సింగ్ రిపోర్టింగ్ ట్రైలర్..

ఇవి కూడా చదవండి





మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *