Headlines

OTT Movie: ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్.. ఓటీటీలోకి రీసెంట్ సూపర్ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్ | Atharvaa And Thaman Starrer Hrudayam Murali Movie To Stream On Netflix OTT From August 7th

OTT Movie: ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్.. ఓటీటీలోకి రీసెంట్ సూపర్ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్ | Atharvaa And Thaman Starrer Hrudayam Murali Movie To Stream On Netflix OTT From August 7th


కోలీవుడ్ స్టార్ అథర్వ, ప్రీతి ముకుందన్ ప్రధాన పాత్రల్లో నటించిన రీసెంట్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘హృదయం మురళి’. అప్పుడెప్పుడో బాయ్స్ సినిమాలో నటించిన మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మళ్లీ సుమారు 20 ఏళ్ల తర్వాత ఈ సినిమాలో నటించడం విశేషం. వీరితో పాటు మలయాళం స్టార్ ఫహాద్ ఫాజిల్, లేటెస్ట్ సెన్సేషన్ కయాదు లోహర్, మాళవికా మోహనన్ వంటి స్టార్స్ ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. టీజర్స్, ట్రైలర్ తోనే పాజిటివ్ వైబ్ తెచ్చుకున్న ఈ సినిమా జులై 11న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ముఖ్యంగా యూత్ ఈ సినిమాను తెగ చూసేశారు. మైత్రీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా తెలుగులోనూ రిలీజైన హృదయం మురళి సినిమాకు ఇక్కడ కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మొత్తానికి తమిళం, తెలుగులోనూ ఆడియెన్స్ ను అలరించిన ఈ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. హృదయం మురళి సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 07 నుంచి ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. తమిళంతో పాటు తెలుగు సహా ఇతర భాషల్లోనూ ఈ సూపర్ హిట్ సినిమా స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుంది.

హృదయం మురళి సినిమాకు ఆకాశ్ భాస్కరన్ దర్శకత్వం వహించారు. నిహారిక ఎన్ఎం, రాంకీ, సుధాకర్, నట్టి సుబ్రహ్మణ్యం, జోనిత గాంధీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. మనోజ్‌ పరమహంస, సీహెచ్‌ సాయి సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరించారు. కాలేజీ ఫ్రెండ్ షిప్, ఫస్ట్ లవ్, వన్ సైడ్ లవ్ వంటి అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. మరి ఓటీటీలో ఈ మూవీకి ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి



నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో హృదయం మురళి సినిమా..

హృదయం మురళి సినిమా ట్రైలర్..



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *