90’s Monsoon: వర్షాకాలం రాగానే గుర్తొచ్చే 90 కాలం నాటి తీపి ముచ్చట్లు
ఆనాటి వర్షపు రోజులను, తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటే ఇప్పటికీ ప్రతి ఒక్కరి పెదవులపై చిరునవ్వు విరుస్తుంది. ఆకాశంలో మబ్బులు పట్టి భారీ వర్షం పడుతుంటే.. “ఇవాళ్టికి స్కూలు వద్దులే ఇంట్లోనే ఉండు” అని ఇంట్లో పెద్దలు చెప్పగానే ఎక్కడలేని సంతోషం కలిగేది. రోజంతా టీవీ ముందు కూర్చుని కార్టూన్లు చూస్తూ గడపడం, ఒకవేళ తప్పక స్కూలుకు వెళ్లాల్సి వస్తే కలర్‌ఫుల్ రెయిన్‌కోట్లు, గొడుగులు వేసుకుని వెళ్లడం ఎంతో సరదాగా ఉండేది. అప్పుడు సగం క్లాస్ ఖాళీగా ఉండేది. ఇక…