Telangana: కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన.. ఎవరు అప్లై చేయాలి.. ఎవరు అక్కర్లేదు? పూర్తి వివరాలివే.. | Telangana New Pensions 2026: Govt Issues Clarification on Cheyutha Eligibility Rules
రాష్ట్రంలో కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ క్రమంలో పింఛన్ల అర్హతలకు సంబంధించి నెలకొన్న సందేహాలపై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. గత ప్రభుత్వాల హయాంలో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల్లోని అర్హత ప్రమాణాలనే ఇప్పుడు కూడా ప్రామాణికంగా తీసుకుంటున్నామని, నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదని వెల్లడించింది. తొలిదశలో వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులతో పాటు ఫైలేరియా, తలసేమియా, సికిల్ సెల్, హీమోఫీలియా వంటి వ్యాధులతో బాధపడుతున్న బాధితులకు…