Headlines

Nuvvu Naaku Nachav: 25 ఏళ్ల ‘నువ్వు నాకు నచ్చావ్’ .. ఈ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో, హీరోయిన్స్ ఎవరంటే? | 25 Years For Venkatesh Nuvvu Naaku Nachav , Do You Know Who Missed This Cult Classic Movie


విక్టరీ వెంకటేష్ సినిమా కెరీర్ లో ఎన్నో ఇండస్ట్రీ హిట్స్, సూపర్ హిట్స్ ఉండచ్చు .. కానీ ‘నువ్వు నాకు నచ్చావ్’ మాత్రం చాలా స్పెషల్. వెంకీ కెరీర్ లోనే ఇది చాలా స్పెషల్ మూవీ అని చెప్పవచ్చు. అందుకు చాలా కారణాలున్నాయి. చిన్నా పెద్దా, క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అందరూ ఈ సినిమాను తెగ ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా ఈ మూవీతో ఫ్యామిలీ ఆడియెన్స్ కు మరింత చేరువైపోయాడు వెంకటేష్. 2001 సెప్టెంబర్ 06న రిలీజైన నువ్వు నాకు నచ్చావ్ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చి పెట్టింది. వెంకటేశ్‌ , ఆర్తి అగర్వాల్‌ ల మధ్య అందమైన ప్రేమకథ, మనసును హత్తుకునే ఫ్యామిలీ ఎమోషన్స్, కడుపుబ్బా నవ్వించే కామెడీ, మళ్లీ మళ్లీ వినాలనిపించే వీనులవిందైన పాటలు, త్రివిక్రమ్‌ పంచులు.. వెరసి నువ్వు నాకు నచ్చావ్ సినిమాను ఒక కల్ట్ క్లాసిక్ గా నిలిపాయి. సినిమా రిలీజై 25 ఏళ్లు గడిచిపోయినా ఈ మూవీ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ టీవీలో ఈ మూవీ వస్తే ఛానెల్ మార్చకుండా చూసే వారు చాలా మందే ఉన్నారు. అలాగే యూట్యూబ్ లోనూ చూసే వారు ఉన్నారు. ఇక ఈ ఏడాది ప్రారంభంలో ఈ సినిమాను రీ రిలీజ్ చేయగా అప్పుడు కూడా ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు. నువ్వు నాకు నచ్చావ్ సినిమా రిలీజై నేటికి 25 ఏళ్లు గడిచాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి.

నువ్వు నాకు నచ్చావ్ సినిమాకు కే. విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు మాటలు రాశారు. ఈ సినిమాకు ముందే విజయ్ భాస్కర్- త్రివిక్రమ్ కాంబినేషన్ లో నువ్వే కావాలి లాంటి బ్లాక్ బస్టర్ మూవీ వచ్చింది.
దీంతో మళ్లీ ఇదే కాంబినేషన్ లో మరో సినిమా ప్లాన్‌ చేశారు నిర్మాత స్రవంతి రవికిషోర్‌. ఫ్యామిలీ ఆడియెన్స్ ను అలరించేలా ‘నువ్వు నాకు నచ్చావ్‌’ స్టోరీని రెడీ చేశారు. దీనికి కూడా నువ్వే కావాలి హీరో తరుణ్ తీనే తీద్దామనుకున్నారు. అయితే కాస్త ఎమోషనల్ సబ్జెక్ట్ కావడంతో సీనియర్ హీరోతో చేస్తే బాగుంటుందనుకున్నారు. అదే సమయంలో నిర్మాత సురేష్ బాబు స్రవంతి రవికిషోర్ కు ఫోన్ చేసి వెంకటేశ్‌ డేట్స్‌ ఉన్నాయని చెప్పారు. దీంతో దర్శకుడు విజయ్‌ భాస్కర్‌, త్రివిక్రమ్‌లు కలిసి వెంకటేశ్‌ ను కలిసి కథ వినిపించారు. కథ విన్న వెంకీ వెంటనే ఓకే చెప్పారు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ముందుగా త్రిష కానీ గజాలాను కానీ తీసుకోవాలనుకున్నారట. అయితే అప్పటికే ఓ హిందీ సినిమా మాత్రమే చేసిన ఆర్తి అగర్వాల్‌ ను కథానాయికగా ఫైనల్ చేశారు. ఇక హీరోయిన్ తండ్రి పాత్ర కోసం ముందుగా నాజర్‌ను అనుకున్నారట. కానీ, స్రవంతి రవికిషోర్‌ మాత్రం ప్రకాశ్‌రాజ్‌ను తీసుకోవాలని పట్టుబట్టారట. అలా మొత్తానికి మంచి స్టార్ క్యాస్టింగ్ తో నువ్వు నాకు నచ్చావ్ సినిమా పట్టాలెక్కింది. సూపర్ హిట్ గా నిలిచి వెంకీ కెరీర్ లోనే ఓ మరపురాని చిత్రంగా మిగిలిపోయింది.

ఇవి కూడా చదవండి



నువ్వు నాకు నచ్చావ్ 4K ట్రైలర్..



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *