“ఖార్గ్ ద్వీపం పూర్తిగా ధ్వంసం” ట్రంప్ సంచలన ప్రకటన..! హోర్ముజ్‌లో హై టెన్షన్..! | US president Donald Trump says Iran’s Kharg is being blown to smithereens
వాషింగ్టన్/టెహ్రాన్: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. వారాలపాటు కొనసాగిన సాపేక్ష ప్రశాంతతకు తెరదించుతూ అమెరికా ఇరాన్‌లోని లారక్ ద్వీపంపై రెండు క్షిపణి లాంచర్లను లక్ష్యంగా చేసుకుంది. హోర్ముజ్ జలసంధిలో సముద్రపు మైన్లను ప్రయోగించేందుకు ఇరాన్ దళాలు సిద్ధమవుతున్నట్లు గుర్తించడంతో ఈ దాడి చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. అమెరికా దాడికి ప్రతీకారంగా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించినట్లు ప్రకటించింది….