భగత్ సింగ్ సజీవ జ్ఞాపకాలను గుర్తు చేసే ప్రదేశాలు.. మీరూ చూసేయండి..! | August 15 Special Trip: Visit these places that commemorate Bhagat Singh’s sacrifice
ఆగస్టు 15 వచ్చిందంటే ప్రతి భారతీయుడిలో దేశభక్తి ఉప్పొంగుతుంది. జాతీయ జెండా, దేశభక్తి గీతాలు, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తుచేసుకునే కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతాయి. ఈసారి ఆగస్టు 15ను మరింత ప్రత్యేకంగా జరుపుకోవాలనుకుంటే.. స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ జీవితంతో ముడిపడి ఉన్న ప్రదేశాలను సందర్శించవచ్చు. పంజాబ్‌లో ఆయన జ్ఞాపకాలను సజీవంగా ఉంచుతున్న కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు చరిత్రను కళ్లముందు నిలిపేలా ఉంటాయి. ఖట్కర్ కలాన్.. భగత్ సింగ్ పూర్వీకుల గ్రామం పంజాబ్‌లోని…