Watch: కింద చూస్తే 3500 అడుగుల లోయ.. పైకి చూస్తే ఆకాశం.. గంటపాటు గాలిలో నరకయాతన! | Maharashtra: A tourist dangling in mid air at Toranmal hill station, Nandurbar district , Rescue success
మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లాలో ఉన్న ప్రముఖ హిల్ స్టేషన్ తోరణ్‌మాళ్‌లో ఉత్కంఠభరిత ఘటన చోటుచేసుకుంది. సీతాఖాయ్ పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన జిప్‌లైన్‌పై ఓ పర్యాటకుడు గాల్లోనే చిక్కుకుపోయాడు. సుమారు 3,500 అడుగుల లోతైన లోయపై జిప్‌లైన్ ఆగిపోవడంతో అతడు దాదాపు గంటపాటు భయంతో విలవిలలాడాడు. సాహస వినోదంలో భాగంగా జిప్‌లైన్ ఎక్కిన పర్యాటకుడు మధ్యలోనే నిలిచిపోయాడు. కింద భారీ లోయ కనిపించడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. ఈ ఘటనను గమనించిన అక్కడి పర్యాటకులు ఆందోళనకు గురయ్యారు….