డంకీ రూట్‌లో అస్సలు వెళ్లకండి.. నరకం కళ్లజూస్తారు నాలాగా! యువకుడి వీడియో వైరల్ | Do not take donkey route to USA Punjab Man In Tearful Video From Mexico
అమెరికాలోకి అక్రమంగా ఎంట్రీ ఇవ్వాలన్న ఏకైక లక్ష్యంతో డంకీ రూట్ ద్వారా వెళ్లి మెక్సికోలో చిక్కుకున్న ఓ పంజాబీ యువకుడు పంచుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను కదిలిస్తోంది. నేను తప్పు చేశాను.. ఎవరూ ఆ రూట్‌లో అమెరికాకు వెళ్లొద్దు ..వైరల్‌గా మారిన వీడియోలో అతను అభ్యర్థించాడు. వీడియోలో యువకుడు ఒక గదిలో మంచంపై పడుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తూ చేతులు జోడించి వేడుకోవడం వీడియో చూసిన వారిని కదిలిస్తోంది. ‘డంకీ’ రూట్‌లో ఎవరూ అమెరికాకు వెళ్లొద్దని…