విజయ్ దేవరకొండ రణబాలి సినిమా వాయిదా పడింది.. దాంతో సెప్టెంబర్ బాక్సాఫీస్ వద్ద లెక్కలన్నీ మారిపోతున్నాయి.. ముఖ్యంగా రిలీజ్ డేట్స్ విషయంలో చాలా మార్పులు జరుగుతున్నాయి. అన్నయ్య వదిలేసిన తేదీ తమ్ముడు కబ్జా చేసారు.. రెండు రోజుల గ్యాప్‌లో 5 సినిమాలొస్తున్నాయి. సెప్టెంబర్ 10, 11 తేదీల కోసమే నిర్మాతలంతా క్యూ కడుతున్నారు. మరింతకీ ఆ సినిమాలేంటి..? టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సెప్టెంబర్ 10, 11 తేదీల కోసం మేకర్స్ మధ్య పెద్ద యుద్ధం జరగబోతోంది. విజయ్ దేవరకొండ నటిస్తున్న రణబాలి సెప్టెంబర్ 11 నుంచి వాయిదా పడింది. అధికారికంగా చెప్పకపోయినా.. అన్నయ్య వదిలేసిన ఆ డేట్‌లోనే తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఎపిక్ సినిమాతో వస్తున్నారంటే సీన్ అర్థమైపోయింది. ఇప్పటికే రిలీజ్ డేట్ కూడా ఇచ్చేసారు మేకర్స్. ఎపిక్ కంటే ముందురోజే సెప్టెంబర్ 10న తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెండు క్రేజీ ప్రాజెక్టులు సిద్ధమవుతున్నాయి. కార్తి హీరోగా నటిస్తున్న సర్దార్ 2 సినిమాను సెప్టెంబర్ 10నే థియేటర్లలో సందడి చేయబోతోంది. ఇక రవితేజ తమ్ముడి కొడుకు మాధవ్ హీరోగా వస్తున్న మారెమ్మ సినిమా కూడా అదే రోజున రిలీజ్ కానుంది. సెప్టెంబర్ 11న జరగబోయే బాక్సాఫీస్ ఫైట్ మరింత ఇంట్రెస్టింగ్‌గా మారనుంది. ఫహాద్ ఫాజిల్ హీరోగా రాజమౌళి సమర్పిస్తున్న డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమాతో పాటు.. సుమంత్ నటిస్తున్న మహేంద్రగిరి వారాహి సైతం అదేరోజు రానున్నాయి. రెండు రోజుల్లో 5 సినిమాలు వస్తుండటంతో.. ఈ క్లాష్‌పై అందరిలోనూ ఆసక్తి పెరిగిపోయింది. ఇందులో ఎవరు విన్నర్‌గా నిలుస్తారనేది చూడాలిక.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్లాస్టిక్ కరెన్సీపై కేంద్రం క్లారిటీ.. ఇక పేపర్ నోట్లు బంద్?
అంతరిక్షంలోకి 13.5 లక్షల మంది పేర్లు.. నాసా సరికొత్త ప్రయోగం!
డెన్మార్క్ రాజకుమారి సంచలనం.. రాయల్ లైఫ్ వదిలి మిలిటరీలోకి ప్రిన్సెస్ ఇసాబెల్లా!
మీ రేషన్ కార్డ్ స్మార్ట్‌కార్డ్‌గా మారబోతోంది.. ఆగస్టు 15న పంపిణీ
హైదరాబాద్‌లో అతిపెద్ద క్రైసిస్.. ఇళ్లు వదిలి పారిపోతున్న పిల్లలు.. తప్పు ఎక్కడ జరుగుతోంది?