Headlines

Parivartan Yoga: మరో రెండ్రోజుల్లో.. వారి జీవితాలను మార్చేసే పరివర్తన యోగం! | Budha–Chandra Parivartana Yoga 2026: These 6 Zodiac Signs May Gain Wealth and Career Growth

Parivartan Yoga: మరో రెండ్రోజుల్లో.. వారి జీవితాలను మార్చేసే పరివర్తన యోగం! | Budha–Chandra Parivartana Yoga 2026: These 6 Zodiac Signs May Gain Wealth and Career Growth


ఈ నెల(ఆగస్టు) 8వ తేదీ నుంచి మూడు రోజుల పాటు బుధ, చంద్రుల మధ్య పరివర్తన జరుగుతోంది. బుధుడికి చెందిన మిథున రాశిలో చంద్రుడు, చంద్రుడికి చెందిన కర్కాటక రాశిలో బుధుడు సంచారం చేయడం జరుగుతుంది. ఈ పరివర్తన మూడు రోజుల పాటే ఉన్నప్పటికీ, దీని ప్రభావం ఈ నెల 22 వరకూ ఉంటుంది. ఇవి రెండూ తండ్రి, కుమారులైనందువల్ల వీటి మధ్య పరివర్తన అనేక రకాల అదృష్టాలను సూచిస్తుంది. భవిష్యత్తుకు పునాదులు వేస్తుంది. దీని వల్ల వృషభం, మిథునం, కన్య, తుల, కుంభం, మీన రాశుల వారికి ధన లాభం, అధికార లాభం కలిగే అవకాశం ఉంది.

వృషభం

ధన స్థానాధిపతి బుధుడికి, తృతీయ స్థానాధిపతి చంద్రుడికి మధ్య పరివర్తన జరిగినందు వల్ల తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందడం జరుగుతుంది. ప్రయత్నపూర్వక ధన లాభం ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక స్థిరత్వం, భద్రత లభిస్తాయి. ఉద్యోగంలో జీతభత్యాలు పెరగడం, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించడం వంటివి జరుగుతాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ప్రయాణాలు బాగా లాభి స్తాయి.

మిథునం

రాశ్యధిపతి బుధుడికి, ధనాధిపతి చంద్రుడికి మద్య పరివర్తన జరగడం వల్ల కొద్ది ప్రయత్నంతో అపార ధన లాభం కలిగే అవకాశం ఉంది. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమై విలువైన ఆస్తి సంక్రమించే సూచనలున్నాయి. ప్రయాణాలు, ప్రయత్నాలు బాగా లాభిస్తాయి. తోబుట్టువులతో సఖ్యత, సాన్నిహిత్యం వృద్ధి చెందుతాయి. ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. శుభవార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి.

కన్య

దశమాధిపతి బుధుడికి, లాభాధిపతి చంద్రుడికి మధ్య పరివర్తన జరిగినందువల్ల విదేశాలకు వెళ్లడం, విదేశాల్లో ఉద్యోగం సంపాదించడం, అక్కడ స్థిరత్వం లభించడం వంటివి జరుగుతాయి. విదేశీ సొమ్ము అనుభవించే యోగం పడుతుంది. ఉద్యోగంలో పదోన్నతి కలుగుతుంది. ఊహించని అదృష్టం పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. పేరు ప్రఖ్యాతులు విస్తరి స్తాయి. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు కలుగుతాయి. అప్రయత్న ధన ప్రాప్తికి అవకాశ ముంది.

తుల

భాగ్యాధిపతి బుదుడికి, దశమాధిపతి చంద్రుడికి పరివర్తన జరగడం వల్ల ఈ రాశివారికి కెరీర్ పరంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. విదేశీ ఆఫర్లు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల రీత్యా ఇతర దేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. అనేక విధాలా సంపద పెరుగుతుంది. ప్రము ఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. సామాజికంగా కూడా అందలాలు ఎక్కడం జరు గుతుంది. పేరు ప్రఖ్యాతులు వృద్ధి చెందుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు ఊహించని లాభాలనిస్తాయి.

కుంభం

ఈ రాశికి పంచమ, షష్ట స్థానాల అధిపతుల మధ్య పరివర్తన జరిగినందువల్ల రాజయోగాలు కలుగుతాయి. రాజకీయ ప్రాబల్యం పెరుగుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగంలో ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి వస్తాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయాలు సాధించడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందే అవకాశం ఉంది.

మీనం

ఈ రాశికి చతుర్థ, పంచమ స్థానాల అధిపతులైన బుధ, చంద్రుల మధ్య పరివర్తన జరిగినందువల్ల ఉద్యోగమూలక ధన లాభం ఉంటుంది. జీతభత్యాలతో పాటు అదనపు రాబడి ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది. నైపుణ్యాలు, ప్రతిభా పాటవాలు వృద్ధి చెందుతాయి. నిరుద్యోగులకు భారీ జీతభత్యాలతో కూడిన ఉద్యోగం లభిస్తుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. మరింత మంచి ఉద్యోగంలోకి మార డానికి అవకాశం ఉంది. ఆశించిన ప్రభుత్వ గుర్తింపుతో పాటు, ధన లాభం కూడా కలుగుతుంది.

(గమనిక: ఈ కథనంలోని వివరాలు జ్యోతిష్య శాస్త్ర విశ్వాసాలు, గ్రహస్థితుల ఆధారంగా అందించబడినవి. వీటిని శాస్త్రీయంగా నిర్ధారించిన అంశాలుగా పరిగణించరాదు. వ్యక్తిగత ఫలితాలు జన్మకుండలి, దశలు, గోచారాలను బట్టి మారవచ్చు.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *