Pawan Kalyan. Interview
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు ఫ్యాన్స్, సినీ రాజకీయ నాయకులు. ఇదిలా ఉంటే.. గతంలో ఆహా ఓటీటీ వేదికగా నందమూరి బాలకృష్ణ హోస్టింగ్ చేసిన అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షోలో పాల్గొన్న పవన్ తన జీవితంలోని కొన్ని క్షణాలను గుర్తు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. చిన్నతనంలో తన అన్నయ్య గారు మెగాస్టార్ చిరంజీవి చెప్పిన మాటలు, “నువ్వేమీ చదువుకోకపోయినా పర్వాలేదు కానీ నువ్వు బ్రతికుండ్రా బాబు,” తన జీవితంలో ఒక ముఖ్య మలుపుగా నిలిచాయని, ఆ ఒక్క సంఘటన తనను చాలా సేవ్ చేసిందని ఆయన గుర్తు చేసుకున్నారు. సెలబ్రిటీగా కనిపించే జీవితంలో కనిపించని కష్టాలను ఆయన వివరించారు.
ఎక్కువమంది చదివినవి : Soundarya: సౌందర్య ఫస్ట్ సినిమా హీరో ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా.. ? 13 ఏళ్లకే స్టార్ డమ్.. ఇప్పుడు ఇలా..
కన్వెన్షనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌కు వెళ్లకుండా, స్వీయ-అధ్యయనం ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఎక్కువ సమయం వెచ్చించానని పవన్ కళ్యాణ్ తెలిపారు. అయితే, “చదివి చదివి ఉన్న మతి పోద్దంటారు” అన్నట్లు, ఎక్కువ చదవడం వల్ల, ఎక్కువ జ్ఞానం, ఎక్కువ వివేకం, ఎక్కువ అశాంతి, ఎక్కువ నరకం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి దాని మీద స్పందించాలనిపించేదని, అన్నీ బ్లాక్ అండ్ వైట్‌లో కనిపించేవని చెప్పారు. ఆ డిప్రెషన్ స్థితి నుంచి బయటపడటానికి చాలా కాలం పట్టిందని, ఆ దశను దాటినా, డిప్రెషన్ తనను చాలా కాలం వెంటాడిందని వెల్లడించారు. ఆ సమయంలో తాను ఎవరితోనూ మాట్లాడేవాడిని కాదని, తన బాధలను పంచుకోవడానికి స్నేహితులు కూడా చాలా తక్కువగా ఉండేవారని, తాను ఎప్పుడూ ఒంటరిగానే ఉండేవాడినని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. డిప్రెషన్‌ను ఎదుర్కోవడానికి స్వామి వివేకానంద పుస్తకాలు వంటి ఆత్మను బలోపేతం చేసే సెల్ఫ్-హెల్ప్ పుస్తకాలను ఎక్కువగా చదివానని చెప్పారు. అలాగే, సమయాన్ని వృధా చేయకుండా, కర్ణాటక సంగీతం నేర్చుకోవడం, మార్షల్ ఆర్ట్స్ సాధన చేయడం, లేదా ఏదో ఒక అధ్యయనంలో లీనమై ఉండటం ద్వారా తనను తాను బిజీగా ఉంచుకున్నానని తెలిపారు.
ఎక్కువమంది చదివినవి : Cinema : దేశాన్ని కుదిపేసిన నిజమైన సంఘటనతో తీసిన సినిమా.. ఓటీటీలో భయం పుట్టించింది.. ట్రెండింగ్‌లో నంబర్ వన్..
ఒక వయస్సుకి వచ్చాక, ఇంట్లో వారిని డబ్బులు అడగడం ఇష్టం లేక, తల్లిదండ్రులకు ఏమీ చేయలేని పరిస్థితి తనలో డిప్రెషన్‌ను మరింత పెంచిందని ఆయన పేర్కొన్నారు. అదృష్టవశాత్తు, సినిమా రంగం తనకు ఒక ఆలంబనగా దొరికిందని, అందుకే దానిని సాధ్యమైనంత మేరకు సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించానని తెలిపారు. ఒక అచీవ్‌మెంట్ వస్తుందని, సూపర్ స్టార్‌డమ్ వస్తుందని తాను ఎప్పుడూ ఊహించలేదని, కేవలం తన పని చేసుకుంటూ వెళ్ళిపోయానని పవన్ కళ్యాణ్ అన్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత వెనక్కి చూసుకుంటే, ఇంత దూరం వచ్చానని అర్థమైందని చెప్పారు. చివరగా, జీవితంలో తీవ్రమైన బాధ ఎదురైనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పవన్ కళ్యాణ్ ఒక స్ఫూర్తిదాయక సందేశం ఇచ్చారు. మనిషికి మనసు, మనసుకు బాధ ఉంటాయని, తట్టుకోలేనంత బాధ వచ్చినప్పుడు, ఏం చేయాలో తెలియని స్థితిలో తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవాలనిపిస్తుందని ఆయన అన్నారు. అలాంటి సమయాల్లో సిగ్గుపడకుండా, మొహమాటం పడకుండా, ఇతరులు ఏమనుకుంటారో అని భయపడకుండా, స్నేహితులు, తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్ళు, అన్నదమ్ములు వంటి వారితో తమ మనసు విప్పి మాట్లాడాలని, బాధను చర్చించాలని ఆయన పిలుపునిచ్చారు. దారినపోయే దానయ్య ఇచ్చే సలహా కూడా జీవితాన్ని మార్చేయొచ్చని, జీవితం ఒక వరం అని, జీవించడం ఒక యోగం అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
ఎక్కువమంది చదివినవి : Nagarjuna : ఆయన తినే రైస్ మనం తినలేము.. నాగార్జున డైట్ రివీల్ చేసిన మేకప్ ఆర్టిస్టు..
ఎక్కువమంది చదివినవి : Tollywood: కొత్తింట్లోకి అడుగుపెట్టిన టాలీవుడ్ హీరోయిన్.. ఫ్యామిలీతో కలిసి గృహ ప్రవేశం.. ఫోటోస్ వైరల్..