Headlines

Petrol: మీరు నింపుకునేది అసలు పెట్రోల్‌నా..? లేదా కల్తీదా..? జస్ట్ ఈ చిన్న ట్రిక్‌తో ఇట్టే పసిగట్టవచ్చు.. చాలామందికి ఈ విషయం తెలియదు..

Petrol: మీరు నింపుకునేది అసలు పెట్రోల్‌నా..? లేదా కల్తీదా..? జస్ట్ ఈ చిన్న ట్రిక్‌తో ఇట్టే పసిగట్టవచ్చు.. చాలామందికి ఈ విషయం తెలియదు..


Petrol: మీరు నింపుకునేది అసలు పెట్రోల్‌నా..? లేదా కల్తీదా..? జస్ట్ ఈ చిన్న ట్రిక్‌తో ఇట్టే పసిగట్టవచ్చు.. చాలామందికి ఈ విషయం తెలియదు..

పెట్రోల్ బంకుల్లో ఇటీవల పలు మోసాలు వెలుగు చూస్తున్నాయి. నాణ్యతలేని ఇంధనాన్ని నింపడం, తక్కువ మోతాదులో నింపడం వంటి మోసాలు జరుగుతుంటారు. దీంతో పెట్రోల్ నింపుకునే సమయంలో వాహనదారులకు చాలా అనుమానాలు ఉంటాయి. నింపుకునేది నాణ్యమైన పెట్రోల్‌నా..? కాదా? అనే డౌట్ పడుతుంటారు. అయితే మీరు నింపుకునే పెట్రోల్ నాణ్యతను చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం అనేక సులభ మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఫిల్టర్ పేపర్, సాంద్రత పరీక్షల ద్వారా పెట్రోల్ నాణ్యతను చెక్ చేసుకోవచ్చు. సరైన పరిమాణం, ధరను ధృవీకరించుకునే హక్కు వినియోగదారులకు ఉంటుంది. పెట్రోల్ స్వచ్చతను ఎలా చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం.

ఫిల్టర్ టెస్ట్ ఎలా చేయాలి..?

ఈ విధానం ద్వారా పెట్రోల్ నాణ్యతను తెలుసుకోవాలంటే ముందుగా డిస్పెన్సింగ్ నాజిల్ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. అనంతరం నాజిల్ కింద ఒక ఫిల్టర్ పేపర్ ఉంచాలి. అనంతరం ఒక చుక్క పెట్రోల్ వేయాలి. ఈ పెట్రోల్ చుక్కలు సుమారు రెండు నిమిషాల్లో ఎలాంటి మరక లేకుండా ఆవిరైపోతే అది సాధారణమైనదిగా గుర్తించవచ్చు. అదే ఫిల్టర్ పేపర్‌పై గులాబీ రంగు మరక కనిపిస్తే అది కల్తీ పెట్రోల్ అని అర్థం చేసుకోవాలి. కిరోసిన్ కలిపి కల్తీ చేయడం అలా వస్తుందని గుర్తించాలి. నిబంధనల ప్రకారం పెట్రోల్ బంకుల్లో ఖచ్చితంగా ఫిల్టర్ పేపర్లు అందుబాటులో ఉంచాలి. ఒకవేళ అందుబాటులో లేకపోతే వాహనదారుడి అభ్యర్థన మేరకు డీలర్ ఖచ్చితంగా అందించాల్సి ఉంటుంది.

సాంద్రత పరీక్ష ఎలా నిర్వహించాలి..?

ఇక రెండో విధానం సాంద్రత పరీక్ష. ఈ టెస్టు ద్వారా పెట్రోల్, డీజిల్ నాణ్యతను తనిఖీ చేయవచ్చు. ఈ విధానంలో 500ml సామర్థ్యంతో కూడిన పారదర్శకమైన, క్రమాంకనం చేయబడిన హైడ్రోమీటర్ జార్, ఒక హైడ్రోమీటర్‌ను ఉపయోగిస్తారు. పంపిణీ యూనిట్ నుండి ఇంధనంతో జార్‌ను సుమారుగా ముప్పావు వంతు నింపుతారు. ఆ తర్వాత ఉష్ణోగ్రత, సాంద్రతను నమోదు చేయడానికి థర్మామీటర్, హైడ్రోమీటర్‌ను జార్‌లోకి చొప్పిస్తారు. ఈ సాంద్రతను ఒక మార్పిడి పట్టికను ఉపయోగించి 15 డిగ్రీల సెంటిగ్రేడ్ టెంపరేచర్‌కు మారుస్తారు. రిటైల్ అవుట్‌లెట్‌లో లభించే రిఫరెన్స్ సాంద్రత పట్టికతో దీనిని పోలుస్తారు.  నిబంధనల ప్రకారం అన్ని పెట్రోల్ బంకుల్లో 5 లీటర్ల మీటర్ తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి. ఇంధన పరిమాణంపై వినియోగదారునికి ఏవైనా సందేహాలుంటే దానిని సరిచూసుకోవచ్చు. ఒకవేళ కల్తీ జరిగిందనే అనుమానం వస్తే పెట్రోల్ బంకుల్లో అందుబాటులో ఉండే ఫిర్యాదుల వ్యవస్థ ద్వారా కంప్లైంట్ చేయాలి. దీంతో అధికారులు స్పందించి చర్యలు తీసుకునే అవాకశం ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *