Headlines

Pradeep Rawat: 150కి పైగా సినిమాలు.. ప్రదీప్ రావత్ ఆస్తులు ఎంతో తెలుసా.. ? బ్యాగ్రౌండ్ ఇదే.. | Actor Pradeep Rawat Net Worth and Gajini Actor Film Journey

Pradeep Rawat: 150కి పైగా సినిమాలు.. ప్రదీప్ రావత్ ఆస్తులు ఎంతో తెలుసా.. ? బ్యాగ్రౌండ్ ఇదే.. | Actor Pradeep Rawat Net Worth and Gajini Actor Film Journey


నటుడు ప్రదీప్ రావత్ మృతితో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. భారతీయ సినీ పరిశ్రమలోని ఉత్తమ ప్రతినాయకులలో ఒకరిగా గుర్తుండిపోతారు. 80వ దశకంలో ఐత్‌బార్ సినిమాతో నటుడిగా సినీ ప్రయాణం స్టార్ట్ చేసిన ఆయన ఆ తర్వాత బి.ఆర్. చోప్రా తెరకెక్కించిన మహాభారత్ అనే ధారావాహికతో మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత నెమ్మదిగా హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళీ చిత్రాలలో కథానాయికులకు ధీటుగా గట్టి పోటీనిచ్చారు. ముఖ్యంగా పవర్ ఫుల్ విలనిజం పండించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రతి పాత్రలో తనదైన నటనతో మెప్పించారు. 2022లో ప్రదీప్‌కు రక్త క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అప్పటి నుంచి చికిత్స తీసుకుంటున్న ఆయన.. నెల రోజులకు పైగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం సాయంత్రం చికిత్స పొందుతూనే కన్నుమూశారు. ప్రదీప్ ప్లేట్‌లెట్లు అత్యంత తక్కువగా ఉన్నాయని, అప్పటి నుంచి ఆయన కోలుకోలేకపోయారని ప్రదీప్ తివారీ సిద్ధార్థ్ తివారీ వెల్లడించారు.

ఎక్కువమంది చదివినవి : Aamani : సినిమాలు మానేసి సీరియల్స్ చేయడానికి కారణం అదే.. ఎట్టకేలకు ఆమని ఓపెన్ కామెంట్స్..

ప్రదీప్ రావత్ అంత్యక్రియలు ఆగస్టు 5, బుధవారం సాయంత్రం జరుగుతాయని అతడి కుటుంబ సభ్యులు వెల్లడించారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు తమ చివరి నివాళులు అర్పించేందుకు ఆయన పార్థివ దేహాన్ని గోరేగావ్‌లోని ఆయన నివాసంలో ఉంచుతారు. రావత్‌కు భార్య కళ్యాణి, 18 ఏళ్ల కుమారుడు విక్రమాదిత్య ఉన్నారు. ఇక ప్రదీప్ రావత్ దాదాపు 150కి పైగా సినిమాలలో నటించారు. నివేదికల ప్రకారం ఆయన ఆస్తులు రూ.41 కోట్లు అని సమాచారం.

ఎక్కువమంది చదివినవి :  K. Raghavendra Rao: ఆ హీరోయిన్‏తో 24 సినిమాలు చేశా.. అలాంటి చావు ఎవరికీ రాకూడదు.. డైరెక్టర్ రాఘవేంద్ర రావు..

రాజమౌళి దర్శకత్వంలో నితిన్ నటించిన సై సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు ప్రదీప్ రావత్. ఇందులో బిక్షూ పాత్రలో పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత భద్ర, అందరివాడు, జగడం, యోగి, వీధి, స్టాలిన్, దేశముదురు, లక్ష్యం, ఆటాడిస్తా, మిత్రుడు, అదుర్స్, గోలీమార్, మంగళ, నిప్పు, నాయక్, అల్లుడు శీను, కబర్యు, లయన్ వంటి తెలుగు చిత్రాలలో నటించాడు . శివలింగ, నేనే రాజు నేనే మంత్రి, ఆచారి అమెరికా యాత్ర, ఆడవాళ్ళు మీకు జోహార్లు, వాల్టెయిర్ వీరయ్య , టైగర్ నాగేశ్వరరావు ఇంటి చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా గజినీ సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రదీప్ రావత్ చివరి కన్నడ చిత్రం ‘ త్రిశూలం’కు ఇంకా విడుదల తేదీ ఖరారు కాలేదు. యన చివరి హిందీ చిత్రం ‘ ఛావా ‘.

ఎక్కువమంది చదివినవి : Tollywood : రూ.16 కోట్లతో తీస్తే 400 కోట్ల కలెక్షన్.. యావత్ దేశమే ఆశ్చర్యపోయేలా చేసిన సినిమా..

ఎక్కువమంది చదివినవి : Ramayana Trailer : ఏముందిరా బాబూ.. కుర్రాళ్లు తెగ వెతుకున్న చిన్నది.. రామాయణ ట్రైలర్‏లో తనే స్పెషల్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *