ఒక్క కన్నుగీటుతో దేశవ్యాప్తంగా ‘వింక్ గర్ల్’గా గుర్తింపు తెచ్చుకుంది మలయాళం హీరోయిన్ ప్రియా ప్రకాశ్ వారియర్. ‘ఒరు అదార్ లవ్’ సినిమాతో సంచలనంగా మారిన ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అయితే తాజాగా ఈ వింక్ బ్యూటీకి వింత అనుభవం ఎదురైంది. తాజాగా ఆమె ఓ బ్రాండ్ ప్రమోషన్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రియా ప్రకాశ్ వారియర్, ఆరెంజ్ (కాషాయం) రంగు దుస్తుల్లో కనిపించింది. ఈ సందర్భంగా అక్కడికి వచ్చని ఓ యూట్యూబర్ ఆమెను ‘బ్రాండ్ బాటిల్ కలర్‌ను చూసి ఈ డ్రెస్ వేసుకున్నారా? లేక కేరళలో ఆరెంజ్ అలర్ట్ ఉందని ఇలా వచ్చారా?’ అనిప్రశ్నించాడు. ఊహించని ప్రశ్న ఎదురుకావడంతో ప్రియా తీవ్ర అసౌకర్యానికి గురైంది. అక్కడున్న వారందరూ కూడా యూట్యూబర్ అడిగిన ప్రశ్నకు ఆశ్చర్యపోయారు. కానీ ప్రియా మాత్రం ‘అలాంటిదేం లేదు.. బ్రాండ్ థీమ్‌కు సరిపోయేలా ఈ డ్రెస్‌ను ఎంపిక చేసుకున్నాను’ అంటూ సింపుల్‌గా ఆన్సర్ ఇచ్చింది.ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. దీనిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు సదరు యూట్యూబర్ పై విమర్శల వర్షం గుప్పిస్తున్నారు.
‘ఎవరు ఏ రంగు దుస్తులు ధరించాలనేది వారి పర్సనల్ ఛాయిస్’, ‘ఇలాంటి ప్రశ్నలు అడగడం సరైంది కాదు’, ‘ సోషల్ మీడియా అటెన్షన్, వ్యూస్ కోసం అనవసర వివాదాలు సృష్టించొద్దు’ అంటూ యూట్యూబర్ ను ట్రోల్ చేస్తున్నారు.
కాగా తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది ప్రియా ప్రకాశ్ వారియర్. నితిన్ తో ‘చెక్’, తేజ సజ్జాతో ‘ఇష్క్.. నాట్ ఏ లవ్ స్టోరీ’, ‘బ్రో’ వంటి సినిమాల్లో హీరోయిన్ గా చేసిందీ ముద్దుగుమ్మ. అలాగే గుడ్ బ్యాడ్ అగ్లీ, పరమ్ సుందరి, సర్వం మాయ వంటి డబ్బింగ్ సినిమాలతోనూ తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైంది. రీసెంట్ గా ‘కజిన్స్ అండ్ కల్యాణ్స్’ వెబ్ సిరీస్‌లో కూడా నటించి ప్రేక్షకులను అలరించిందీ అందాల తార. ప్రస్తుతం ‘త్రి మంకీస్’, ‘లవ్ హ్యాకర్స్’ తదితర సినిమాలతో బిజీ బిజీగా ఉంటోంది ప్రియా ప్రకాశ్ వారియర్.
ఇవి కూడా చదవండి
వీడియో ఇదిగో..
Reporter: Why are you wearing saffron colour.?
Actor – Priya Varrier
Places – Syria/ Afghanistan. pic.twitter.com/Tn1sTipJls— The Kerala Girl ( Indian ) (@the_kerala_girl) August 5, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.