ఏపీ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక జారీ చేసింది. రాబోయే మూడ్రోజుల్లో పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఈ మేరకు పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. ఉత్తర ఒడిశా, దానిని ఆనుకుని ఉన్న గంగా పరివాహక పశ్చిమ బెంగాల్ ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం, ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా-గంగా పరివాహక పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. అలాగే నిన్నటి ఆగ్నేయ బంగాళాఖాత ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 4 .5 నుండి 5 .8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతున్నది. ఇక ఆంధ్ర ప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో పశ్చిమ, వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలను అమరావతి వాతావరణశాఖ జారీ చేసింది. వాటి వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
మూడ్రోజుల పాటు వర్షాలు
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలలో రాబోయే మూడ్రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఇక ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. ఇఖ దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్, రాయలసీమలో ఈరోజు ,రేపు, ఎల్లుండి
తేలికపాటి నుండి మోస్తరు వర్షాలకు అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. వర్షాల సమయంలో బలమై న గాలులు వీచే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ
హైదరాబాద్ సహా 10 జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణశాఖ సూచించింది. హైదరాబాద్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది., కుమురం భీమ్, మేడక్, ములుగు, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్ధిపేట, వికారాబాద్, మహబూబ్నగర్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో తేలికపాటి వర్షాలకు కురుస్తాయని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.