Headlines

Rains: ఏపీ, తెలంగాణకు భారీ వర్షసూచన.. వాతావరణశాఖ అప్డేట్ ఇదే.. | Depression Over Bay of Bengal to Bring Heavy Rains and Strong Winds Across Andhra pradesh and Telangana


వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్-ఉత్తర ఒడిశా తీర ప్రాంతాలలో ఏర్పడిన వాయుగుండం ఆగస్టు 17, 2026 ఉదయం 8.30 గంటలకు అదే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. ఇది కోల్‌కతాకు సమీపంలో 22.5° ఉత్తర అక్షాంశం, 88.3° తూర్పు రేఖాంశం వద్ద సత్ఖీరా (బంగ్లాదేశ్)కు పశ్చిమ-నైరుతి దిశలో సుమారు 80 కి.మీ, బంకురా (పశ్చిమ బెంగాల్)కు ఆగ్నేయంగా 160 కి.మీ, బాలేశ్వర్ (ఒడిశా)కు ఈశాన్యంగా 180 కి.మీ. దూరంలో ఉంది. ఇది రాబోయే 24 గంటల్లో మొదట ఉత్తర-వాయువ్య దిశగా, ఆపై గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్ మీదుగా వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది. సగటు సముద్ర మట్టం వద్ద ఉన్న రుతుపవన ద్రోణి ఇప్పుడు ఫిరోజ్‌పూర్, ముజఫర్‌నగర్, బస్తీ, పాట్నాల గుండా.. పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌లోని తీరప్రాంతాలపై ఆనుకొని ఉన్న ప్రాంతాలు, వాయువ్య బంగాళాఖాతంపై ఉన్న వాయుగుండం కేంద్రం మీదుగా.. అక్కడి నుండి ఆగ్నేయంగా ఈశాన్య బంగాళాఖాతం వైపుగా ప్రయాణిస్తోంది.

షియర్ జోన్ ఈ రోజు సుమారుగా 22° ఉత్తర అక్షాంశం వెంబడి మధ్య, ఆనుకొని ఉన్న ఉత్తర భారతదేశం ద్వీపకల్ప ప్రాంతము మీదుగా సగటు సముద్ర మట్టానికి 3.1, 9.4 కి.మీ. ఎత్తులో విస్తరించి ఉంది. వీటి ఫలితంగా ఏపీలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలను అమరావతి వాతావరణ కేంద్రం విడుదల చేసింది. దీని ప్రకారం ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో రాబోయే మూడ్రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముందని అంచనా వేసింది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్,రాయలసీమలో కూడా రాబోయే మూడు రోజుల పాటు వానలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.

తెలంగాణలో వర్షాలు

రుతుపవన ద్రోణి ఈరోజుసగటు సముద్ర మట్టం వద్ద ఫిరోజ్‌పూర్, ముజఫర్‌నగర్, బస్తీ, పాట్నా, కోస్తా పశ్చిమ బెంగాల్, దానిని ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్, వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో కేంద్రీకృతమైన వాయుగుండం కేంద్రం గుండా వెళ్లి అక్కడి నుండి ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వరకు కొనసాగుతోంది. షియర్ జోన్ఇప్పుడు సగటు సముద్ర మట్టానికి 3.1 మరియు 9.4 కిలోమీటర్ల ఎత్తు మధ్య, మధ్య, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ద్వీపకల్ప భారతదేశం మీదుగా దాదాపు 22°N అక్షాంశం వెంబడి కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలంగాణలో ఈరోజు, రేపు కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబద్ వాతావరణశాఖ తెలిపింది. ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. రాగల మూడు రోజుల్లో క్రింది స్థాయి ఉపరితల గాలుల వేగం 30 నుంచి 40 కి.మీ వరకు కొన్ని ప్రాంతాలలో కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *