Headlines

Ram Charan: కియారా అద్వానీ కాదు.. రామ్ చరణ్-సుక్కూ మూవీలో 3వేల కోట్ల సినిమా హీరోయిన్.. జోడీ అద్దిరిపోయింది | Not Kiara Advani This Bollywood Actress Act With Ram Charan In Sukumar RC 17 Movie, Details Here


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలే ‘పెద్ది’ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్నారు. థియేటర్లలో రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా ఓటీటీలోనూ రికార్డులు కొల్లగొట్టింది. భారీ వ్యూయర్ షిప్ సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత చేతికి సర్జరీ చేయించుకున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం ఇంటి దగ్గరే విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇదే క్రమంలో తన తర్వాతి సినిమా కోసం కూడా రెట్టింపు ఉత్సాహంతో రెడీ అవుతున్నాడు రామ్ చరణ్. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌తో చేయబోతున్న RC 17 ప్రాజెక్టు స్క్రిప్ట్ పనులను పూర్తిచేసే పనిలో బిజీగా ఉన్నాడు చరణ్. ప్రస్తుతం ప్రీ పొడక్షన్ పనులు జరుపుకుంటోన్న ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. ఆర్ సీ 17లో మొదట కియారా అద్వానీని హీరోయిన్ గా తీసుకోవాలనుకున్నారట. చాలా రోజుల క్రితమే ఈ బాలీవుడ్ హీరోయిన్ ను ఫైనల్ చేసినట్లు వార్తలు వచ్చాయి. గతంలో రామ్‌ చరణ్‌, కియారా కాంబినేషన్‌లో రెండు సినిమాలు వచ్చాయి. ‘వినయ విధేయ రామ’, ‘గేమ్‌ ఛేంజర్‌’ ల్లో వీరు హీరో, హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో సుక్కూ సినిమాలో కియారాను హీరోయిన్ గా తీసుకున్నారని తెలియగానే మెగాభిమానులు ఆందోళన చెందారు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన మరో ఆసక్తికర అప్‌ డేట్‌ వచ్చింది.

ఆర్ సీ 17 కియారా స్థానంలో మరో హీరోయిన్‌ని పరిశీలిస్తోందట చిత్ర బృందం. ప్రస్తుతం ఈ రేసులో ధురంధర్ సినిమాల హీరోయిన్ సారా అర్జున్ పేరు మొదట వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడికి పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్, పాపులారిటీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్, సుకుమార్ సినిమాలో సారానే హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతుందో తెలియాల్సి ఉంది. ఇక వేళ ఇదే నిజమైతే మెగాభిమానులకు మంచి ట్రీట్ అని చెప్పవచ్చు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి



సారా అర్జున్ లేటెస్ట్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *