Headlines

RBI Gold: ఆర్బీఐ వద్ద ఎంత బంగారం ఉందో తెలుసా..? | Do You Know How Much Gold the RBI Has? Centre Reveals Key Details

RBI Gold: ఆర్బీఐ వద్ద ఎంత బంగారం ఉందో తెలుసా..? | Do You Know How Much Gold the RBI Has? Centre Reveals Key Details


RBI Gold: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద 880.52 మెట్రిక్ టన్నుల బంగారం ఉందని కేంద్ర ప్రభుత్వం గత మంగళవారం పార్లమెంటుకు తెలియజేసింది. అయితే, దేశంలోని మతపరమైన ప్రదేశాలు, కుటుంబాల వద్ద ఎంత బంగారం ఉందనే సమాచారం తమ వద్ద లేదని ప్రభుత్వం అదే సమయంలో పేర్కొంది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి అడిగిన ప్రశ్నకు రాజ్యసభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం వెల్లడైంది. 2026 జూన్ 26 నాటి డేటా ప్రకారం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద 880.52 మెట్రిక్ టన్నుల బంగారం ఉంది.

ఆర్‌బిఐ బంగారు నిల్వలు పెరిగాయి:

2025 మార్చి 31 నాటికి ఆర్‌బిఐ వద్ద 879.58 మెట్రిక్ టన్నుల బంగారం ఉందని పంకజ్ చౌదరి చెప్పారు. అంతకు ముందు 2024 మార్చి 31 నాటికి, ఆర్‌బిఐ వద్ద 822.10 మెట్రిక్ టన్నుల బంగారం ఉండేది. ప్రస్తుతం ఆర్‌బిఐ వద్ద ఎంత బంగారం ఉంది? దేశంలోని మతపరమైన ప్రదేశాలు, భారతదేశంలోని కుటుంబాల వద్ద ఎంత బంగారం ఉందో తెలుసుకోవడానికి అధ్యయనం నిర్వహించారా అని ఒక ప్రశ్న అడిగారు. ఈ ప్రశ్నకు రాజ్యసభలో ప్రభుత్వం సమాధానం ఇచ్చింది.

ఇది కూడా చదవండి: House Construction Cost: 100 గజాల స్థలంలో ఇంటి నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందో తెలుసా?

ఇవి కూడా చదవండి



రూపాయి బలపడటం వల్ల దేశీయ మార్కెట్లో బంగారం, వెండి దిగుమతి వ్యయం తగ్గిందని బంగారు వ్యాపారులు తెలిపారు. యూఎస్ ఫెడ్ రిజర్వ్ ద్రవ్య విధాన ప్రకటనకు ముందు పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉన్నారు. బంగారం ధరలు పడిపోతున్నాయని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ పరిశోధన విశ్లేషకుడు సౌమిల్ గాంధీ అన్నారు.

ఇది కూడా చదవండి: Electric Bike: ఒక్కసారి చార్జ్ చేస్తే 260 కి.మీ.. కొత్త ఎలక్ట్రిక్ బైక్ లాంచ్.. ధర ఎంతంటే..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *