Headlines

School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఆగస్ట్‌లో తెలుగు రాష్ట్రాల్లో భారీగా సెలవులు! | Good News for Students: Telugu States to Get Several Holidays in August

School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఆగస్ట్‌లో తెలుగు రాష్ట్రాల్లో భారీగా సెలవులు! | Good News for Students: Telugu States to Get Several Holidays in August


School Holidays: ఆగస్ట్‌ నెల ప్రారంభమైపోయింది. ఈ నెలలో ఎన్నో ముఖ్యమైన రోజులు ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించినది. ఈ ఆగస్ట్‌ నెలలో విద్యార్థులకు భారీగా సెలవులు వస్తున్నాయి. సెలవులు అంటేనే ఎగిరిగంతులేసే విద్యార్థుల ఈ నెల ఎంతో కీలకం కానుంది. వరుస సెలవులతో ఎంజాయ్‌ చేయనున్నారు. తల్లిదండ్రులు ఎక్కడైన టూన్‌ ప్లాన్‌ చేసుకున్నట్లయితే ఈ నెల ఎంతో కలిసి రానుంది. మరి ఈ నెలలో ఎన్ని రోజులు విద్యార్థులకు సెలవులు రానున్నాయో చూద్దాం..

ఈ ఆగస్ట్‌ నెలలో అనేక ముఖ్యమైన తేదీలు అలాగే సెలవులు ఉన్నాయి. ఇండిపెండెన్స్ డే, రక్షాబంధన్, ఈద్ ఇల్ మిలాద్ ఈ నెలలోనే ఉంది. వాటితోపాటు వారాంతపు సెలవులు కలుపుకుంటే ఈ సెలవులు భారీగానే ఉండనున్నాయి. అయితే ఆగస్టు నెలలో హాలీడే షెడ్యూల్ రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటుందని గుర్తించుకోండి. మొత్తంగా చూస్తే ఆగస్టు నెలలో విద్యార్థులకు 4 నుంచి 7 రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి. అలాగే రాష్ట్రాన్ని బట్టి మారనున్నాయి.

ఆగస్టులో సెలవుల లిస్టు ఓ సారి చూస్తే ఆగస్టు 2 ఆదివారం రోజున సాధారణంగా ఉండే సెలవే. ఆగస్టు 9 ఆదివారం రోజున సెలవు., ఆగస్టు 15 శనివారం రోజున ఇండిపెండెన్స్ డే సందర్భంగా సెలవు, ఆగస్టు 16 ఆదివారం రోజున వీక్లీ హాలీడే ఉంటుంది. అలాగే ఆగస్టు 23 న ఆదివారం. ఆగస్టు 26 రోజున ఈద్ ఈ మిలాద్ సందర్భంగా అనేక రాష్ట్రాల్లో పాఠశాలలకు సెలవు ఉంటుంది. ఇక ఆగస్టు 28 శుక్రవారం రోజున రక్షా బంధన్ అనేక రాష్ట్రాల్లో సెలవు ఉంటుంది. ఇక చివరగా ఆగస్టు 30 ఆదివారం రోజున సెలవు ఉంటుంది. ఇలా మొత్తంగా 8 రోజులు ఈనెలలో విద్యార్థులకు సెలవులు రానున్నాయి. దాంతో విద్యార్థులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి



అలాగే భారీ వర్షాల కారణంగా ఇప్పటికే తెలంగాణ విద్యార్థులకు ఊహించని విధంగా సెలవులు వస్తున్నాయి. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో కుండపోత వానలు, వరద పరిస్థితుల కారణంగా నిన్న (జూలై 30) సెలవులు ఇచ్చారు. ఈ రోజు శనివారం కూడా కొన్ని పాఠశాలలు సెలవు ఇస్తుంటాయి. మరి కొన్ని పాఠశాలలు ఆఫ్‌డే ఇస్తుంటాయి. ఆదివారంతో కలిపి మూడ్రోజులు సెలవులు వచ్చాయి.

భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ఏర్పాట్ల కారణంగా ఇందుకోసమే ఈ రెండు జిల్లాల్లోని ప్రైవేట్ విద్యాసంస్థలకు శుక్రవారం, శనివారం సెలవులు ప్రకటించారు. ఇక రేపు ఆదివారం ఎలాగో సెలవు ఉంటుంది. ఇలా ఏపీలోని విజయనగరం జిల్లాలో వరుసగా మూడు రోజుల పాటు సెలవులు వచ్చాయి.

అంతేకాకుండా వీటితో పాటు చాలా పాఠశాలలు రెండో అలాగే నాలుగో శనివారం రోజున కూడా సెలవు ఇస్తుంటాయి. ఇక కొన్ని రాష్ట్రాల్లో ఈ సెలవులు తక్కువగా.. మరికొన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటాయి. అందువల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు అధికారిక స్కూల్ హాలీడే కాలెండర్ ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తానికి ఈ నెలలోనూ దాదాపు 8 రోజుల పాటు విద్యార్థులకు సెలవులు రావడంతో ఎంతో ఎంజాయ్‌ చేసేందుకు అవకాశం ఉంటుంది. అటు భారీ వర్షాల కారణంగా చాలా రాష్ట్రాల్లోని జిల్లాల్లో పాఠశాలలు మూసివేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *