Headlines

Shubman Gill: హాఫ్ సెంచరీతో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్ | Shubman gill breaks virat kohli record wtc 1000 runs 2nd test


Shubman Gill: శ్రీలంక పర్యటనలో టీమిండియా టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాట్‌తో మళ్లీ రికార్డుల వేట మొదలుపెట్టారు. కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరిట ఉన్న అరుదైన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) రికార్డును ఆయన బద్దలు కొట్టారు. శ్రీలంకతో కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్లు ఇద్దరూ తక్కువ స్కోరుకే వెనుతిరగడంతో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ క్రీజులోకి వచ్చారు. గాల్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 24 రన్స్ మాత్రమే చేసి నిరాశపరిచిన గిల్, ఈసారి మాత్రం ఎంతో నిలకడగా ఆడారు. కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకుంటూ 50 రన్స్ చేసి రాణించారు.

కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన గిల్

ఈ అర్ధశతకంతో శుభ్‌మన్ గిల్ ఒకే డబ్ల్యూటీసీ సైకిల్‌లో 1000 రన్స్ పూర్తి చేసుకున్న తొలి భారత కెప్టెన్‌గా చరిత్ర సృష్టించారు. ప్రస్తుత డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్‌లో గిల్ ఇప్పటివరకు 10 టెస్టుల్లోని 17 ఇన్నింగ్స్‌ల్లో 68 సగటుతో 1024 రన్స్ సాధించారు. ఇందులో 5 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గతంలో విరాట్ కోహ్లీ తొలి డబ్ల్యూటీసీ (2019-21) సైకిల్‌లో 15 మ్యాచ్‌ల్లోని 24 ఇన్నింగ్స్‌ల్లో 934 రన్స్ చేశారు. ఇప్పుడు కోహ్లీని దాటేసి గిల్ అగ్రస్థానంలో నిలిచారు.

ఇది కూడా చదవండి:Yash Chandra Prakash: ధోని స్ఫూర్తితో UPSCలో సక్సెస్! ఇప్పుడు నాగర్ కర్నూల్‌ ఎఫ్‌డీఓగా..

శ్రీలంక బౌలర్లపై ఆధిపత్యం

2025 ఇంగ్లాండ్ పర్యటన నుంచి టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత గిల్ వరుసగా పరుగులు సాధిస్తూ వస్తున్నారు. కొలంబో టెస్టులో దేవదత్ పడిక్కల్‌తో కలిసి మూడో వికెట్‌కు 120 రన్స్ విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. శ్రీలంక బౌలర్లను ఎంతో సులువుగా ఎదుర్కొంటూ సెంచరీ దిశగా సాగుతున్న సమయంలో అనవసరమైన షాట్ ఆడి వికెట్ పారేసుకున్నారు. పెద్ద స్కోరు చేసే అవకాశాన్ని చేజార్చుకోవడంతో గిల్‌తో పాటు అభిమానులు కూడా తీవ్రంగా నిరాశకు గురయ్యారు.

ఇది కూడా చదవండి: Vaibhav Sooryavanshi: అంత హైప్ ఇచ్చారు.. చివరికి 8 పరుగులేనా! వైభవ్‌కు తొలి మ్యాచ్‌లోనే గట్టి దెబ్బ

పటిష్ట స్థితిలో భారత్

గిల్, పడిక్కల్ రాణించడంతో తొలి రోజు ఆటలో భారత జట్టు మంచి ఆధిక్యం వైపు పయనిస్తోంది. కెప్టెన్‌గా ముందుకు ఉండి జట్టును నడిపించడమే కాకుండా ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ రికార్డును తన పేరిట లిఖించుకోవడం గిల్ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచే అంశం. కెప్టెన్‌గా కెరీర్ ప్రారంభించిన తక్కువ సమయంలోనే విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాల రికార్డులను తిరగరాయడం శుభ్‌మన్ గిల్ అత్యుత్తమ ఫామ్‌కు నిదర్శనం. రాబోయే మ్యాచ్‌ల్లో కూడా గిల్ ఇలాగే చెలరేగితే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత్ అర్హత సాధించడం మరింత సులువవుతుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *