Headlines

Stock Market: చూడటానికి ఓ సామాన్య వృద్దుడు.. కానీ రూ.100 కోట్ల సంపాదన.. మీకు నమ్మశక్యంగా లేదా..? | Viral Video: Elderly Man Claims Massive Stock Holdings Worth Nearly 100 Crore

Stock Market: చూడటానికి ఓ సామాన్య వృద్దుడు.. కానీ రూ.100 కోట్ల సంపాదన.. మీకు నమ్మశక్యంగా లేదా..? | Viral Video: Elderly Man Claims Massive Stock Holdings Worth Nearly 100 Crore


కర్ణాటకకు చెందిన ఒక వృద్ధుడు తన స్టాక్ పెట్టుబడుల గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆయన స్టాక్ మార్కెట్ పెట్టుబడుల విలువ ఇప్పుడు దాదాపు రూ. 100 కోట్లు ఉండవచ్చని నెటిజన్లు అంచనా వేస్తున్నారు. వృద్దుడుని చూస్తే నిరాడంబరంగా, సాదాసీదా ఉన్నాడు. కానీ అతని దగ్గర రూ.100 కోట్ల విలువ చేసే స్టాక్స్ ఉంటాయని చాలామందికి నమ్మశక్యంగా లేదు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఒక వ్లాగర్ వృద్ధుడితో సంభాషిస్తూ కనిపించాడు. ఎన్ని షేర్లు మీ దగ్గర ఉన్నాయన అడగ్గా.. దానికి ఆ వృద్ధుడు స్పందిస్తూ తన వద్ద లార్సెన్ & టూబ్రో (L&T)కి చెందిన 27,855 షేర్లు, అల్ట్రాటెక్ సిమెంట్‌కు చెందిన సుమారు 2,475 షేర్లు, కర్ణాటక బ్యాంక్‌కు చెందిన 4,000 షేర్లు ఉన్నాయని తెలిపాడు.

రూ.100 కోట్ల ఆదాయం

ఈ పెట్టుబడుల నుండి వచ్చే ఆదాయం గురించి వృద్దుడిని అడగ్గా.. ఆ వ్యక్తి తనకు ఏటా డివిడెండ్ల రూపంలో సుమారు రూ. 6.5 లక్షలు వస్తున్నాయని, ఆ సొమ్ముతో హాయిగా జీవించవచ్చని చెప్పాడు. ఈ అంచనా ప్రకారం వృద్దుడి షేర్ల విలువ రూ. 100 కోట్లకు పైగా ఉంటుంది. ఎల్&టి షేర్ల విలువ సుమారు రూ. 80 కోట్లు, అల్ట్రాటెక్ సిమెంట్స్ విలువ దాదాపు రూ. 21 కోట్లు, కర్ణాటక బ్యాంక్ షేర్ల విలువ సుమారు రూ. 1 కోటి ఉంటుందదని చెబుతున్నారు. వృద్ధుడి వ్యాఖ్యలపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. అతను నిరాడంబరంగా జీవించాలని నిర్ణయించుకుంటే.. ఇంత సంపద ఉండి కూడా ప్రయోజనం ఏమిటని కొందరు ప్రశ్నించగా.. మరికొందరు ఆ వృద్ధుడి దగ్గర అంత సంపాదన ఉందంటే నమ్మడం లేదు.

నెటిజన్ల అభిప్రాయం ఇదే..

“సాధారణంగా ఉండటంలో గొప్పతనం ఏమీ లేదు. మీ దగ్గర డబ్బు ఉంటే విలాసాలను అనుభవించండి. డబ్బు ఉండి కూడా వాటిని అనుభవించకూడదనుకుంటే.. అది కూడా అంతే.. అందులో గొప్పేమీ లేదు” అని ఒక యూజర్ రాశారు. మరొకరు మాట్లాడుతూ “100 కోట్లు ఉండి ఏం ప్రయోజనం? మీ తర్వాతి తరం మాత్రమే చెడిపోతుందా??” అంటూ వ్యాఖ్యానించాడు. “ఇలా పెట్టడం సరికాదు. దీని తర్వాత అతని ప్రాణానికి ప్రమాదం ఉండవచ్చు” అని మరో నెటిజన్ రాశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *