Headlines

Sumanth: అన్నం తక్కువ, కూరలు ఎక్కువ.. రోజూ ఇలా చేస్తే చాలు.. 51 ఏళ్ల వయసులో హెల్త్ సీక్రెట్ చెప్పిన సుమంత్.. | Actor Sumanth Reveals Akkineni Family Strict Fitness and Diet Secrets

Sumanth: అన్నం తక్కువ, కూరలు ఎక్కువ.. రోజూ ఇలా చేస్తే చాలు.. 51 ఏళ్ల వయసులో హెల్త్ సీక్రెట్ చెప్పిన సుమంత్.. | Actor Sumanth Reveals Akkineni Family Strict Fitness and Diet Secrets


ఒకప్పుడు హీరోగా అలరించిన సుమంత్.. ప్రస్తుతం సహయ నటుడిగా రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన ఆరోగ్య రహస్యాలు, కుటుంబ ఫిట్‌నెస్ అలవాట్లు, బాల్య జ్ఞాపకాలను పంచుకున్నారు. అక్కినేని కుటుంబంలో తరతరాలుగా పాటిస్తున్న క్రమశిక్షణే తమ ఫిట్‌నెస్‌కు మూలమని సుమంత్ స్పష్టం చేశారు. తాతగారు (దివంగత ఏఎన్‌ఆర్) జీవితం పట్ల, వ్యాయామం పట్ల ఎంతో డిసిప్లిన్‌తో ఉండేవారని సుమంత్ గుర్తు చేసుకున్నారు. అప్పట్లో వెయిట్ లిఫ్టింగ్ వంటివి లేకపోయినా, ఆయన తనదైన శైలిలో వ్యాయామం చేసేవారని, ముఖ్యంగా ఉదయం నడకను ఎప్పుడూ మానేవారు కాదని సుమంత్ తెలిపారు. ఈ క్రమశిక్షణ ఇప్పుడు నాగార్జునగారు, నాగ చైతన్య, అఖిల్, తాను కూడా కొనసాగిస్తున్నామని అన్నారు. కుటుంబంలో ప్రతి ఒక్కరూ జిమ్‌ను అస్సలు మిస్ అవ్వకుండా చూసుకుంటారని, రోజుకు కనీసం రెండు గంటల పాటు వ్యాయామం చేయడం తమ నిత్యకృత్యమని సుమంత్ వెల్లడించారు. ఆహారపు అలవాట్లు కూడా పైనుంచే అంటే తాతగారి దగ్గర నుంచి వచ్చాయని ఆయన వివరించారు.

ఆహార నియమాలు:
ఆహారం విషయంలో తాము చాలా క్రమశిక్షణతో ఉంటామని సుమంత్ చెప్పారు. తాతగారు చిన్నప్పటి నుంచీ “అన్నం తక్కువ, కూరలు ఎక్కువ” అని చెప్పేవారని, అది తమ కుటుంబంలో ఇప్పటికీ పాటిస్తున్న అలవాటు అని తెలిపారు. నాగార్జునగారు తెల్ల అన్నానికి బదులుగా బ్రౌన్ రైస్ తింటారని, లేదా చాలా తక్కువగా తింటారని అన్నారు. సుమంత్‌కు ప్రోటీన్‌తో పాటు కూరగాయలంటే కూడా బాగా ఇష్టమని, నాన్-వెజ్ తిన్నా కూడా పరిమితంగానే తీసుకుంటానని చెప్పారు. సినిమా షూటింగ్‌ల సమయంలో రుచికరమైన ఆహారం లభించినా, టెంప్ట్ అవ్వకుండా జాగ్రత్త పడతానని తెలిపారు. ఎప్పుడైనా ఎక్కువ తిన్నప్పుడు, మరుసటి రోజు అదనపు వ్యాయామంతో దాన్ని కాంపెన్సేట్ చేస్తానని సుమంత్ పేర్కొన్నారు. వ్యాయామమే తనను బ్రతికించిందని, ఆరోగ్యం విషయంలో క్రమశిక్షణే అత్యంత ముఖ్యమని ఆయన నొక్కి చెప్పారు. 50 ఏళ్లు దాటిన తర్వాత ఫిట్‌నెస్‌ను మెయింటెయిన్ చేయడం కష్టమని బయటివాళ్లు అనుకుంటారని, అయితే డబ్బు ఉన్నంత మాత్రాన కాకుండా క్రమశిక్షణ ఉంటేనే అది సాధ్యమని అన్నారు.

సుమంత్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదువుకున్నారు. హైదరాబాద్ తనకు ఎంతో ఇష్టమైన నగరమని, తన బాల్య జ్ఞాపకాలెన్నో ఇక్కడే ఉన్నాయని చెప్పారు. తన స్కూల్ ఫ్రెండ్స్‌లో కొందరు ఇప్పటికీ తనకు ఆత్మీయ మిత్రులని తెలిపారు. సినీ పరిశ్రమ నుంచి తమ స్కూల్ నుండి మొదట నాగార్జునగారు వచ్చారని, ఆ తర్వాత తాను, ఆ తర్వాత రానా దగ్గుబాటి వచ్చారని, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ నుండి నాగ అశ్విన్ కూడా ఇదే స్కూల్ నుండి వచ్చారని సుమంత్ పంచుకున్నారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : రూ.16 కోట్లతో తీస్తే 400 కోట్ల కలెక్షన్.. యావత్ దేశమే ఆశ్చర్యపోయేలా చేసిన సినిమా..

ఎక్కువమంది చదివినవి : Ramayana Trailer : ఏముందిరా బాబూ.. కుర్రాళ్లు తెగ వెతుకున్న చిన్నది.. రామాయణ ట్రైలర్‏లో తనే స్పెషల్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *