Headlines

Suriya : సూర్య, మహేష్ బాబుకు మధ్య ఉన్న కామన్ కనెక్షన్ ఏంటో తెలుసా.. ? సినిమాల్లోకి రాకముందే అనుబంధం.. | Do you know what the common connection between Suriya and Mahesh Babu


దక్షిణాది చిత్రసీమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న కథానాయకుడు సూర్య. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ, నటనలో ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని చూపే సూర్య, తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో సుపరిచితుడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన సూర్య, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు , సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజాలతో తనకు ఉన్న ప్రత్యేక బంధాన్ని , పాఠశాల రోజుల జ్ఞాపకాలను పంచుకున్నారు. సూర్య తెలిపిన వివరాల ప్రకారం, సూపర్ స్టార్ మహేష్ బాబు, సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా, హీరో కార్తి , సూర్య అందరూ ఒకే పాఠశాలలో చదువుకున్నారు. వీరందరూ చెన్నైలోని ప్రముఖ సెయింట్ బెడ్స్ పాఠశాలలో విద్యను చదువుకున్నారు. మహేష్ బాబు తనకు క్లాస్‌మేట్ అని సూర్య ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : 2026లోనే అట్టర్ ప్లాప్.. ఓటీటీలోకి వచ్చిన వెంటనే ట్రెండింగ్ నంబర్ వన్.. ఏ మూవీ అంటే..

చిన్ననాటి నుంచి ఒకరికొకరు తెలుసని, తమ మధ్య సుమారు 18 ఏళ్లకు పైగా సుదీర్ఘమైన ప్రయాణం , అపరిమితమైన జ్ఞాపకాలు ఉన్నాయని తెలిపారు. సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజాతో తనకు ఉన్న సాన్నిహిత్యం గురించి కూడా సూర్య ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. యువన్ చిన్నతనంలో కుర్చీపైకి ఎక్కి పియానో వాయించే రోజుల నుంచి ఆయనను చూస్తున్నానని సూర్య అన్నారు. తన సినీ కెరీర్ ప్రారంభంలో యువన్ ఇచ్చిన అద్భుతమైన సంగీతం వల్ల తనకు మంచి బ్రేక్ లభించిందని, ఆయన సంగీతానికి తాను పెద్ద అభిమానని చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి : Yeshanagula : . ఈ పాటలో ఇంత అర్ధం ఉందా.. ఏశనాగుల కట్ట మీద సాంగ్ లిరిక్స్‏కు అర్థం ఇదే..

ప్రస్తుతం సినీ పరిశ్రమలో వేర్వేరు భాషల్లో అగ్ర నటులుగా, సంగీత దర్శకులుగా కొనసాగుతున్నప్పటికీ, తమ చిన్ననాటి స్నేహం , పరస్పర గౌరవం ఇప్పటికీ అలాగే నిలిచి ఉన్నాయని సూర్య పేర్కొన్నారు. ఒకే పాఠశాల నుంచి వచ్చిన వ్యక్తులు ఈ రోజు చిత్రసీమలో ఉన్నత స్థానాల్లో రాణిస్తూ, మళ్లీ కలసి పనిచేస్తుండటం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: ఆ సినిమాతోనే నా జీవితం మలుపు తిరిగింది.. ఆయన మూవీ అప్పట్లో సంచలనం.. తనికెళ్ల భరణి.

ఎక్కువ మంది చదివినవి : Cinema : సినిమా అంటే ఇది భయ్యా.. ఒక్క దెబ్బతో టాక్సిక్, దురంధర్ చిత్రాలు వెనక్కు.. థియేటర్లను షేక్ చేస్తున్న మూవీ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *