Headlines

Tamil Nadu: విజయ్ వర్సెస్ ఉదయనిధి.. మధ్యలోకి విశాల్..

Tamil Nadu: విజయ్ వర్సెస్ ఉదయనిధి.. మధ్యలోకి విశాల్..


Tamil Nadu: విజయ్ వర్సెస్ ఉదయనిధి.. మధ్యలోకి విశాల్..

తమిళనాడు పాలిటిక్స్‌ హాట్‌హాట్‌గా మారాయి. గత వారం పది రోజులుగా హీట్‌ ఏమాత్రం తగ్గడం లేదు. త్రిష- విజయ్‌ను ఉద్దేశించి ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌ ఇన్‌డైరెక్ట్‌గా చేసిన కామెంట్స్‌ ఓ రేంజ్‌లో కాక రేపాయి. చివరికి.. ఉదయనిధి అరెస్ట్‌ వరకు వెళ్లాయి. ఆ వేడి చల్లారకముందే తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవడంతో మళ్లీ హీట్‌ కంటిన్యూ అవుతోంది. ప్రధానంగా.. కావేరి జలాలు, మేకెదాటు డ్యామ్ వివాదంపై తమిళనాడు అసెంబ్లీలో తీవ్ర దుమారం రేగింది. సీఎం విజయ్‌ టార్గెట్‌గా ప్రతిపక్ష నేత ఉదయనిధి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ రెండు అంశాలపై చర్చకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కర్నాటక సీఎం డీకే శివకుమార్‌తో సీఎం విజయ్‌ భేటీకి సిద్ధమవడంపైనా ప్రశ్నల వర్షం కురిపించారు.

ప్రతిపక్ష నేత ఉదయనిధి కామెంట్స్‌కు సీఎం విజయ్‌ కౌంటర్‌ ఇచ్చారు. కావేరి జలాలు, మేకెదాటు డ్యామ్‌ నిర్మాణ వివాదంపై కీలక ప్రకటన చేశారు. ఇతర రాష్ట్రాలతో మాట్లాడి సమస్యలు పరిష్కరించుకుంటే తప్పేంటని డీఎంకేని అటాక్‌ చేశారు. అంతేకాదు.. తమను అవమానించినా ఫర్వాలేదు.. కానీ.. రాష్ట్రానికి నీళ్లు రావాలన్నారు. తమిళనాడు ప్రజల కోసం ఎన్ని అవమానాలు ఎదుర్కొనేందుకైనా రెడీ అన్నారు సీఎం విజయ్‌.

ఇక.. ఇద్దరు హీరోల కామెంట్స్‌తో ఇప్పటికే తమిళ రాజకీయం రచ్చ రేగుతోంది. ఈ ఎపిసోడ్‌లోకి మరో హీరో ఎంట్రీ ఇంట్రస్టింగ్‌గా మారింది. సీఎం విజయ్‌, ప్రతిపక్ష నేత ఉదయనిధి మధ్య వార్‌పై.. విశాల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం విజయ్‌ తన సీనియర్‌ అయితే.. ఉదయ్‌నిధి బ్యాచ్‌మేట్‌ అని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే.. నటి త్రిషపై ఉదయనిధి తప్పుడు కామెంట్స్‌ చేసి ఉండాల్సింది కాదన్నారు. ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని హీరో విశాల్‌ సూచించారు.

మొత్తంగా.. ఇద్దరు హీరోల పొలిటికల్‌ వార్‌ టైమ్‌లో విశాల్‌ ఎంట్రీ తమిళ రాజకీయాల్లో స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. విజయ్‌- త్రిష విషయంలో ఉదయనిధి కామెంట్స్‌ కరెక్ట్‌ కాదనే ఇండికేషన్స్‌ ఇచ్చినట్టు అయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *