Headlines

Telangana: జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే.. | Telangana educational institutions bandh on July 24th friday student unions call for neet paper leakage issue

Telangana: జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే.. | Telangana educational institutions bandh on July 24th friday student unions call for neet paper leakage issue


Telangana: తెలంగాణలో జూలై 24న శుక్రవారం విద్యాసంస్థలు బంద్‌ ఉండనున్నాయి. విద్యావ్యవస్థను నాశనం చేసేలా కేంద్రం చర్యలు ఉన్నాయని తెలంగాణలోని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తూ బంద్‌కు పిలుపునిచ్చాయి. అందులో భాగంగానే నీట్ ప్రశ్నాపత్రాలు లీకేజీ ఇతర అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని, ఇందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చారు.

శుక్రవారం తెలంగాణలోని విద్యాసంస్థలన్నీ బంద్ చేసి విద్యార్థులు చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని విద్యార్థి సంఘాల ఐక్య వేదిక పిలుపునిచ్చింది. ఇందులో ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌,ఎన్‌ఎస్‌యూఐ, పీఎస్‌డీయూ, ఏఐఎఫ్‌డీఎస్‌ సంఘాలు ఉద్యమ కార్యాచరణ ప్రారంభించాయి.

విద్యావ్యవస్థ నాశనమవుతున్న నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రధాన డిమాండ్‌ అని వారన్నారు. తర్వాత పరీక్షలు సరిగా నిర్వహించకుండా ప్రశ్నాపత్రాల లీకేజీకి కారణమైన NTAను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. అలాగే నీట్‌ ప్రశ్నాపత్రాల లీకేజీకి కారణమైన వారిపై చర్యలకు డిమాండ్ చేస్తూ విద్యార్థులు చేపట్టిన నిరసనలో లాఠీఛార్జ్ చేసిన వారిపై చర్యలకు డిమాండ్ చేశారు. విద్యార్థులపై పెట్టిన కేసులు కూడా వెనక్కి తీసుకోవాలని నినదించారు.

ఈ డిమాండ్‌ల నెరవేరేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, మేథావులు సహకరించాలని విద్యార్థి సంఘాలు విజ్ఞప్తి చేశారు. అందులో భాగంగా శుక్రవారం జరిగే విద్యాసంస్థల బంద్‌కు సహకరించాలని అన్నారు. ఇందు కోసం ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు అన్నీ కూడా బంద్ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని వారు హెచ్చరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *