Telangana EAPCET 2026: తెలంగాణలోని ప్రభుత్వ వర్సిటీలు, ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో ఈఏపీసెట్ (EAPCET) ఇంజనీరింగ్ తుదివిడత కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు పూర్తయింది. సాంకేతిక విద్యాశాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 80 శాతం సీట్లు భర్తీ కాగా, ఇంకా 19,102 సీట్లు (సుమారు 20%) ఖాళీగా మిగిలిపోయాయి.
సీట్ల వివరాలు ముఖ్యాంశాలు:
- మొత్తం సీట్లు: 94,156
- భర్తీ అయినవి: 75,054 (80%)
- మిగిలిన సీట్లు: 19,102 (20%)
- తుదివిడత దరఖాస్తులు: ఆప్షన్లు పెట్టుకున్న 35,096 మంది అభ్యర్థుల్లో కొత్తగా 3,281 మందికి సీట్లు దక్కాయి.
- ఈడబ్ల్యూఎస్ (EWS) కోటా: 10% రిజర్వేషన్ కింద 5,771 మంది అభ్యర్థులకు సీట్లు లభించాయి.
ఏ కేటగిరీ కాలేజీల్లో ఎలా ఉందంటే?
- ప్రైవేటు యూనివర్సిటీలు: అత్యధికంగా 99% సీట్లు భర్తీ అయ్యాయి.
- ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు: 80% సీట్లు భర్తీ అయ్యాయి.
- ప్రభుత్వ యూనివర్సిటీలు: 69% సీట్లు నిండాయి.
ప్రభుత్వ కాలేజీ (కోస్గి): రాష్ట్రంలోని ఏకైక ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలోని 214 సీట్లలో కేవలం 45 సీట్లు (21%) మాత్రమే భర్తీ కావడం గమనార్హం. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా మెజారిటీ విద్యార్థులు కంప్యూటర్ సైన్స్, దానికి సంబంధించిన అలైడ్ కోర్సుల వైపే మొగ్గు చూపారు.
- సీఎస్ఈ (CSE): 84%
- సీఎస్ఈ ఏఐఎమ్ఎల్ (AI&ML): 86%
- సీఎస్ఈ సైబర్ సెక్యూరిటీ: 92%
- సీఎస్ఈ బిజినెస్ సిస్టమ్స్: 86%
100% నిండిన కోర్సులు:
తక్కువ సీట్లు అందుబాటులో ఉన్న సీఆర్సీ, సీఐటీ, బయోమెడికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలిమాటిక్స్, వీఎల్ఎస్ఐ డిజైన్, ఇన్స్ట్రుమెంటేషన్, మెటలర్జికల్, మెకాట్రానిక్స్, ఆటోమొబైల్ కోర్సుల్లో 100% సీట్లు భర్తీ అయ్యాయి.
కోర్ (Core) ఇంజనీరింగ్ కోర్సులు:
- ఈసీఈ (ECE): 79%
- సివిల్ (Civil): 69%
- ఈఈఈ (EEE): 65%
- మెకానికల్ (Mechanical): 64%
ఆగస్టు 7 లోగా రిపోర్టింగ్
తుదివిడత కౌన్సెలింగ్లో సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 7వ తేదీలోగా కేటాయించిన ఫీజును చెల్లించి, సంబంధిత కాలేజీలో స్వయంగా రిపోర్టు చేయాలని సాంకేతిక విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు.