Headlines

The Paradise Teaser: ‘ది ప్యారడైజ్’ టీజర్ వచ్చేసింది.. నానిని ఇలా ఎప్పుడూ చూసి ఉండరు.. రిలీజ్ డేట్ ఫిక్స్ | Nani The Paradise Official Teaser Out Now, Movie To Release On September 24th

The Paradise Teaser: ‘ది ప్యారడైజ్’ టీజర్ వచ్చేసింది.. నానిని ఇలా ఎప్పుడూ చూసి ఉండరు.. రిలీజ్ డేట్ ఫిక్స్ | Nani The Paradise Official Teaser Out Now, Movie To Release On September 24th


న్యాచురల్ స్టార్ నాని నటిస్తోన్న లేటెస్ట్ సినిమా ది ప్యారడైజ్. దసరా సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన డైరెక్టర్ శ్రీకాంత్ తెరకెక్కిస్తోన్న ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో లేటెస్ట్ సెన్సేషన్ కయాదు లోహర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు విలన్ గా చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన కంటెంట్ అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా జడల్ పాత్రలో మునుపెన్నడు లేని మాస్ లుక్ లో నాని కనిపించారు. తాజాగా ది మోస్ట్ అవైటెడ్ ‘ది ప్యారడైజ్’ టీజర్ విడుదలైంది. దిష్టంతా పోవాలే అంటూ రక్తపాతమే సృష్టిస్తున్నారు. జడల్ జమానా షురూ అంటూ తనదైన స్టైల్‌లో నాని రచ్చ చేశారు. ‘ప్యారడైజ్’ టీజర్‌లో మెయిన్ హైలైట్‌గా డైలాగ్స్ అండ్ విజువల్స్ నిలిచాయి. టీజర్ మొదలవ్వడమే నాని వాయిస్‌తో షురూ అయింది.. వెంటనే మోహన్ బాబు ఎంట్రీ.. ఆ తర్వాత విలన్ రాఘవ్ జుయల్, కయాదు లోహర్ షాట్స్.. టీజర్ చివర్లో దిష్టితీసే సీన్.. ఇలా ఒక్కోటి శ్రీకాంత్ ఓదెల అదిరిపోయేలా డిజైన్ చేసుకున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబ్ 24వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ది ప్యారడైజ్ సినిమాను  ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ మూవీని రూపొందిస్తున్నారు. రాక్ స్టార్ అనిరుధ్ ఈ సినిమాకు స్వరాలు అందిస్తున్నారు. రీసెంట్ గా రిలీజైన టీజర్ లోనూ అనిరుధ్ బీజీఎమ్ హైలెట్ గా నిలిచింది. అలాగే మోహన్ బాబు కూడా ఓ డిఫరెంట్ విలన్ పాత్రలో కనిపిస్తుండడం తో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి



సెప్టెంబర్ 24 నుంచి జడల్ జమానా షురూ..

నాని ది ప్యారడైజ్ సినిమా టీజర్..



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *