Headlines

Tollywood : ఒళ్లు హూనం చేసుకుంటున్న స్టార్ హీరోలు.. వరుస ప్రమాదాలతో ఫ్యాన్స్‌లో కంగారు | Tollywood stars Ram Charan, Balakrishna, Jr. NTR, Pawan Kalyan got injured recently leaving fans worried

Tollywood : ఒళ్లు హూనం చేసుకుంటున్న స్టార్ హీరోలు.. వరుస ప్రమాదాలతో ఫ్యాన్స్‌లో కంగారు | Tollywood stars Ram Charan, Balakrishna, Jr. NTR, Pawan Kalyan got injured recently leaving fans worried


సినిమా ఇండస్ట్రీలో వరుస ప్రమాదాలు అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. తమ అభిమాన హీరోలు వరుసగా గాయాలపాలు అవుతుండటంతో ఫ్యాన్స్ కంగారుపడుతున్నారు. ప్రాణాలకు తెగించి సినిమాల కోసం కష్టపడుతున్న హీరోలు అనుకోని ప్రమాదాల బారినపడుతున్నారు. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో అన్ని జాగ్రత్తలు తీసుకున్న ఎదో ఒక రూపంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. దైవాలు గా భావించే తమ హీరోలు ఇలా ఒళ్లు హూనం చేసుకొని కట్లతో కనిపించడాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. రీసెంట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమా షూటింగ్ సమయంలో గాయపడ్డారు. షూటింగ్ సమయంలో ఆయన కంటి భాగానికి గాయం అయ్యింది. వెంటనే ఆయనకు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కనుబొమ్మ పై గాయం అయ్యిందని పెద్దగా కంగారు  పడాల్సిన అవసరం లేదు అని వైద్యులు తెలిపారు. ఆ వెంటనే ఆయన చేతికి గాయం అయ్యింది. పెద్ది సినిమా ప్రమోషన్స్ లోనూ చరణ్ చేతికి కట్టుతో కనిపించారు. రీసెంట్ గానే  కోయంబత్తూరులో రామ్ చరణ్‌కు మణికట్టు సర్జరీ జరిగింది.

ఇది కూడా చదవండి : వారెవ్వా..! చంద్రముఖి చిన్నారి ఎంత మారిపోయింది..!! ఇప్పుడు చూస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే

అలాగే నటసింహం నందమూరి బాలకృష్ణ కూడా షూటింగ్ లో గాయపడ్డారు. రాజమండ్రిలో జరుగుతున్న తన తాజా చిత్రం NBK111 షూటింగ్‌లో పాల్గొంటున్న సమయంలో ఆయన ఎడమ మోకాలికి గాయం అయ్యింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు, మెరుగైన పరీక్షలు, ప్రత్యేక చికిత్స కోసం ఆయన్ను ఎయిర్‌లిఫ్ట్ ద్వారా హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. సర్జరీ తర్వాత ఆయన తిరిగి కోలుకుంటున్నారు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కూడా ఇటీవలే సర్జరీ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ఇటీవల భుజానికి శస్త్ర చికిత్స జరిగిన విషయం అందరికి తెలిసిందే. జూలై 11న ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కళ్యాణ్‌కు ఆర్థ్రోస్కోపిక్ విధానంలో శస్త్రచికిత్స నిర్వహించారు.

ఇది కూడా చదవండి : 21 సినిమాలు చేస్తే.. మూడు మాత్రమే హిట్..! కట్ చేస్తే విలన్‌గానూ అదరగొట్టాడు

మొన్నామధ్య అక్కినేని యంగ్ హీరో అఖిల్ చేతికి కూడా గాయం అయ్యిందని నాగార్జున తెలిపారు. లెనిన్ సినిమా షూటింగ్ కు ముందు అఖిల్ కు ఇంట్లో ప్రమాదం జరిగిందని నాగ్ తెలిపారు. తాజాగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ భుజానికి గాయం అయ్యింది. షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో తారక్ భుజానికి గాయం అయింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ షూటింగ్ లో భుజానికి గాయమైనట్లు ఎన్టీఆర్ టీమ్ అధికారికంగా వెల్లడించింది. పూర్తిగా కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలిపింది. దాంతో అభిమానులు తారక్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

ఇవి కూడా చదవండి



ఇది కూడా చదవండి : Raja Ravindra: ఆ హీరో పెళ్ళికి నేను కాళ్లు కడిగాను.. ఆ ఇద్దరూ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్..!!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *