Headlines

Tollywood : పెళ్లి కాకుండానే కలిసి ఉంటున్నాం.. అప్పుడే విడిపోవాలని అనుకున్నాం.. టాలీవుడ్ నటి.. | Actress Soniya Singh Reveals the Journey of Love, Struggles, and Mental Well being With Siddu Pavan

Tollywood : పెళ్లి కాకుండానే కలిసి ఉంటున్నాం.. అప్పుడే విడిపోవాలని అనుకున్నాం.. టాలీవుడ్ నటి.. | Actress Soniya Singh Reveals the Journey of Love, Struggles, and Mental Well being With Siddu Pavan


టాలీవుడ్ నటి సోనియా సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బుల్లితెరపై సీరియల్స్, పలు షోలలో పాల్గొని మంచి గురింపు తెచ్చుకుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రేమ, మానసిక ఆరోగ్యం, సంబంధాలలో ఎదురయ్యే సవాళ్లను ఎలా అధిగమించాలో వివరిస్తూ, తన వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు. ప్రేమలో లేదా వృత్తిలో సమస్యలు ఎదుర్కొని డిప్రెషన్‌కు గురయ్యే వారికి ఆమె విలువైన సలహాలను అందించారు. పాఠశాల లేదా కళాశాల దశలో మార్కుల కారణంగా ఆత్మహత్య చేసుకునే వారి గురించి ప్రస్తావిస్తూ, బాహ్య ఒత్తిళ్లే దీనికి కారణమవుతాయని పేర్కొన్నారు. అటువంటి పరిస్థితుల్లో సహనం కలిగి ఉండటం, సమయం తీసుకోవడం ద్వారా ఆ డిప్రెషన్ నుండి బయటపడగలమని ఆమె నమ్మకం వ్యక్తం చేశారు. తన ఆరేళ్ల ప్రేమ బంధం గురించి మాట్లాడుతూ, సిద్ధు పవన్‌తో తన ప్రయాణం ఎన్నో కష్టాలు, పోరాటాలు, అపార్థాలతో కూడుకున్నదని సోనియా సింగ్ వెల్లడించారు. గత ఏడాది మూడు నెలల పాటు తాము చాలా కఠినమైన దశను ఎదుర్కొన్నామని, విడిపోదామా అన్న ఆలోచన కూడా వచ్చిందని తెలిపారు. అయితే, ఇద్దరూ జీవితాంతం కలిసి ఉండాలని స్పష్టమైన నిర్ణయం తీసుకోవడం వల్ల, ఆత్మహత్య లేదా డిప్రెషన్ వంటి తీవ్రమైన ఆలోచనల వైపు వెళ్లలేదని ఆమె అన్నారు. ఈ అనుభవం నుండి బయటపడటానికి సమయం, సహనం ఎంత ముఖ్యమో ఆమె చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి : Jason Sanjay: ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే.. దూరమయ్యాకే విలువ తెలిసింది.. విజయ్ దళపతి కొడుకు జాసన్ సంజయ్..

సంబంధాలలో అహం (“ఈగో”) అనేది అతిపెద్ద సమస్య అని సోనియా సింగ్ అన్నారు. అహం కారణంగానే గొడవలు పెద్దవి అవుతాయని, నువ్వెంత అంటే నేనంత అనే భావన బంధాన్ని దెబ్బతీస్తుందని ఆమె చెప్పారు. ఈ అహాన్ని బ్రేక్ చేయగలిగితే, గొడవలు త్వరగా సమసిపోతాయని, కేవలం గంటలో మళ్లీ మాట్లాడేవాళ్ళం కాబట్టి, ముందే మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవడం మంచిదని సూచించారు. గొడవపడి ఏడవడం కంటే, నవ్వుతూ సంతోషంగా ముందుకు సాగడం మంచి జీవితాన్ని అందిస్తుందని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : ఓటీటీలో దుమ్మురేపుతున్న సస్పెన్స్ థ్రిల్లర్.. 3 ఏళ్లుగా ట్రెండ్ అవుతున్న క్రైమ్ సిరీస్..

పెళ్లి చేసుకోవాలనుకునే జంటలకు సలహా ఇస్తూ, అహం లేకుండా, ఒకరిపై ఒకరు నెగ్గాలనే ఆలోచన లేకుండా ఇద్దరు భాగస్వాములు కలిసి జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. కలిసి ఎదిగి, ప్రతిదీ అర్థం చేసుకుంటే సంతోషకరమైన జీవితం ఉంటుందని చెప్పారు. చిన్న గొడవలను పెద్దవి చేసుకోకుండా, అక్కడికక్కడే ముగించడం వల్ల సంబంధాలు బలపడతాయని తెలిపారు. గొడవల్లో కోపంతో నోరు జారి ఏదో ఒకటి అనేసినా, మన ఉద్దేశ్యం భాగస్వామిని బాధపెట్టడం కాదని గుర్తుంచుకోవాలని అన్నారు. గతంలో తన జీవితంలో ఇలాంటివి మళ్లీ రాకూడదు అని అనుకున్న సంఘటనలు చాలా ఉన్నాయని, కానీ ఇప్పుడు వాటివల్లే తాను బలంగా మారానని సోనియా సింగ్ అన్నారు. ప్రతి సమస్యనూ ఎదుగుదలకు ఒక అవకాశంగా చూడాలని, అప్పుడే జీవితంలో ముందుకు వెళ్లగలమని ఆమె చెప్పారు. బంతిని ఎంత బలంగా కొడితే అంత పైకి బౌన్స్ అయినట్టు, ఎన్ని సమస్యలు వస్తే అంత విజయం సాధిస్తామని చెప్పుకొచ్చారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : గ్లామర్ సీన్స్ చేస్తానని ఏడ్చేశాను.. నాకెందుకు అలాంటి సీన్స్ రాలేదు.. టాలీవుడ్ హీరోయిన్..

సోనియా సింగ్..

ఎక్కువ మంది చదివినవి :  Cinema : రూ.150 కోట్లు పెట్టి పరమ చెత్త సినిమా తీశారు.. ఇండస్ట్రీలో అతిపెద్ద డిజాస్టర్.. ఇప్పటికీ కోలుకోని నిర్మాత..



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *