Headlines

Tollywood: 10th క్లాస్ హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే మావ.. సినిమాలకు దూరంగా ఎందుకు ఉందంటే.. | 10th Class Actresss Saranya Nag Opens Up on Struggles, Weight Loss and Tollywood Dreams

Tollywood: 10th క్లాస్ హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే మావ.. సినిమాలకు దూరంగా ఎందుకు ఉందంటే.. | 10th Class Actresss Saranya Nag Opens Up on Struggles, Weight Loss and Tollywood Dreams


10th క్లాస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి శరణ్య నాగ్ గుర్తుందా.. ? ఫస్ట్ మూవీ తర్వాత అంతగా సినిమాల్లో కనిపించలేదు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, అలాగే తన తిరిగి రాకపై చెప్పుకొచ్చారు. బాలనటిగా నాలుగేళ్ల వయసులోనే మణిరత్నం తిరుడా తిరుడా సినిమాతో వెండితెరపై అడుగుపెట్టిన శరణ్య, అప్పటి నుంచి అనేక చిత్రాలలో బాలనటిగా, జూనియర్ ఆర్టిస్ట్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించారు. ప్రేమిస్తే చిత్రంలో హీరోయిన్ పాత్రకు మొదట తనకే అవకాశం వచ్చినా, కొన్ని కారణాల వల్ల ఫ్రెండ్ పాత్ర చేయాల్సి వచ్చిందని గుర్తుచేసుకున్నారు. అయితే, ఆ ఫ్రెండ్ పాత్ర తనకు గొప్ప గుర్తింపు తెచ్చిపెట్టిందని, తమిళంలో ఆ పాత్రకు తానే డబ్బింగ్ చెప్పానని వివరించారు. ఈ చిత్రం తర్వాత తనకు చాలా ఆఫర్లు వచ్చాయని, వాటితో తాను సంతోషంగా ఉన్నానని తెలిపారు. శరణ్య తన వ్యక్తిగత కష్టాలను కూడా పంచుకున్నారు.

ఆమె సినీ నేపథ్యం లేని మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చారు. చిన్నప్పటి నుంచే తండ్రి లేకపోవడంతో, తల్లి ఒక్కతే ఆమెను పెంచిందని, తల్లి ఆర్థిక అవసరాల కోసమే తాను సినిమాల్లోకి వచ్చానని చెప్పారు. 10th క్లాస్ సినిమా సమయంలో, తల్లికి సినీ పరిశ్రమ వ్యవహారాలు తెలియకపోవడంతో తనకు పెద్ద గ్యాప్ వచ్చిందని, తమిళంలో అవకాశాలు దక్కించుకుంటూ నెట్టుకొచ్చామని తెలిపారు. సినీ పరిశ్రమలోని బలాబలాలు ఇప్పుడు అర్థమవుతున్నాయని, అప్పుడు తనకు సినీ బ్యాక్‌గ్రౌండ్, స్నేహితులు, మార్గదర్శనం లేకపోవడం తన కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. 19 ఏళ్ల వయసులో తల్లి కూడా తన నుండి దూరమవ్వాలని కోరడంతో, అది తన జీవితంలో పెద్ద నిరాశను మిగిల్చిందని శరణ్య తెలిపారు. అప్పుడు ప్రపంచాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక హాస్టల్, పీజీల్లో గడిపానని చెప్పారు. ఈ సమయంలో జయం రవి సరసన హీరోయిన్‌గా నటించిన పెరాన్మై వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించినా, తల్లి దూరం కావడం తనను బాగా ప్రభావితం చేసిందన్నారు. తెలుగులో ప్రేమ ఒక మైకం చేశాక, దూసుకెళ్తా సినిమాలో నటించానని, అయితే ఆ తర్వాత హైపోథైరాయిడిజం, హార్మోన్ల అసమతుల్యత కారణంగా 2015 నుంచి తన బరువు 70 కిలోల నుంచి 120 కిలోలకు పెరిగిందని వెల్లడించారు. ఈ మార్పు తనలో తీవ్రమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌ను కలిగించిందని, తనకు సపోర్ట్ చేసేవారు ఎవరూ లేకపోవడంతో ఒంటరిగా ఈ సమస్యను ఎదుర్కొన్నానని వివరించారు.

2020లో కరోనా సమయంలో, తాను మళ్ళీ సినిమాల్లోకి రావాలని లేదా వీజేగా మారాలని ప్రోత్సాహం వచ్చిందని శరణ్య అన్నారు. అప్పుడు డబ్బింగ్ స్టూడియో పుష్కర, అలాగే డివినిటీ షాప్‌ను ప్రారంభించానని తెలిపారు. గత సంవత్సరం, జూన్-జులైలో బరువు తగ్గడానికి చివరి ప్రయత్నం చేశానని, అది సత్ఫలితాలనిచ్చిందని చెప్పారు. ఇప్పుడు తెలుగు సినిమాల్లో మంచి అవకాశాల కోసం చూస్తున్నానని, తెలుగు బిగ్ బాస్ నుండి ఆఫర్ వస్తే పరిశీలిస్తానని, అయితే తన తెలుగు అంత ఫ్లూయెంట్ కాదని కొంచెం సందేహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తనకు తెలుగు సినిమాల్లో మంచి క్యారెక్టర్లు చేయాలనే కోరిక ఉందని, తన నటనతో రాణించాలని ఆశిస్తున్నానని శరణ్య నాగ్ స్పష్టం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ ఇద్దరూ హీరోలకు తల్లిగా అస్సలు నటించను.. సీనియర్ నటి శరణ్య..

శరణ్య నాగ్ పోస్ట్..

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: కేవలం నలుగురు మనుషులు.. ప్రతి సీన్ భయానకం.. ఈఓటీటీలో ఈ థ్రిల్లర్ మూవీ సంచలనం..



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *