Headlines

UPI Payments: ఇంటర్నెట్ లేకపోయినా యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు.. ఫోన్ పే నుంచి అదిరిపోయే ఫీచర్.. | PhonePe Launches Offline UPI Payments: Feature Phone Users Can Now Pay Without Internet


ఫోన్ పే అదిరిపోయే ఫీచర్ తీసుకొచ్చింది. ఇంటర్నెట్ లేకపోయినా యూపీఐ పేమెంట్స్ చేసుకునే ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఫీచర్ ఫోన్లలో దీనిని ప్రవేశపెట్టింది. ఇక నుంచి ఫీచర్ ఫోన్లను ఉపయోగించేవారు ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా డిజిటల్ పేమెంట్స్ చేయవచ్చు. దీని ద్వారా దేశంలో 20 కోట్లకుపైగా ఫీచర్ ఫోన్ వినియోగదారులకు యూపీఐ సౌకర్యాలు అందించిన ఫ్లాట్‌ఫామ్‌గా ఫోన్ పే నిలిచింది. ఫోన్ పే యూపీఐ 123పే సేవల ద్వారా 2జీ కనెక్టివిటీ తక్కువగా ఉన్న ప్రాంతాల్లోని ప్రజలకు యూపీఐ చెల్లింపులను సులభతరం చేస్తోంది

యూపీఐ చెల్లింపుల కోసం ఫోన్ పే సొంత సాంకేతికతతో పాటు ఎస్ఎంఎస్ ఆధారిత వ్యవస్థను ఉపయోగిస్తుంది. అయితే ఇంటర్నెట్ లేకుండా యూపీఐ పేమెంట్స్ చేసేందుకు వీలుగా నోకియా, హెచ్‌ఎండీ, లావా, ఐటెల్ వంటి తయారీ కంపెనీలతో ఫోన్ పే జత కట్టింది. యూపీఐ 123పే ద్వారా ఫీచర్ ఫోన్లకు యూపీఐ పేమెంట్స్ సౌకర్యాన్ని విస్తరించనుంది. కేవలం స్మార్ట్‌ఫోన్లకే కాకుండా ఫీచర్ ఫోన్లకు కూడా యూపీఐ సౌకర్యాలను విస్తరించాలనే ఉద్దేశంతో ఫోన్ పే ఈ ప్రయత్నం చేస్తోంది. 30 కోట్ల మందిని డిజిటల్ చెల్లింపుల పరిధిలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఫోన్ పే స్పష్టం చేసింది.

ఫీచర్ ఫోన్ల యూజర్లకు అందుబాటులో ఉండే సేవలు

పర్సనల్ టూ పర్సనల్ నగదు ట్రాన్సాక్షన్లు, పీర్ టు మర్చంట్ పేమెంట్స్, కెమెరాలతో కూడిన ఫీచర్ ఫోన్లలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా చెల్లింపులు చేసే అవకాశం, బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేయడం, లావాదేవీల చరిత్రను యాక్సెస్ చేయడం లాంటివి చేయవచ్చు. అయితే కొత్త వినియోగదారులకు సహాయం అందించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్ప్ లైన్ సేవలను ఫోన్ పే ప్రవేశపెట్టింది. ఇంగ్లీష్‌తో పాటు మొత్తం 12 భారతీయ భాషల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే రాబోయే రోజుల్లో యుటిలిటీ బిల్లులు, మొబైల్ రీఛార్జ్ సేవలను కూడా ఇందులో చేర్చాలని చూస్తోంది. కాగా జులై నాటికి ఫోన్‌పేకు 71.5 కోట్లకుపైగా నమోదిత వినియోగదారులు ఉండగా.. 5 కోట్లకుపైగా వ్యాపారులు ఉన్నారు.

ఇవి కూడా చదవండి



ఎలా నమోదు చేసుకోవాలి..?

PhonePe UPI 123Payని సెటప్ చేయడానికి వినియోగదారులకు స్మార్ట్‌ఫోన్ అవసరం లేదు. ఫీచర్ ఫోన్లలో ఇన్‌స్టాల్ చేయబడిన ఫోన్ పే యాప్ తెరవాలి. అనంతరం నిబంధనలు, షరతులకు అంగీకరించాలి. అందుబాటులో ఉన్న ఎంపికల నుండి తమ బ్యాంకును ఎంచుకోవడం ద్వారా చెల్లింపులు ప్రారంభించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *