కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 34 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆగస్టు 28, 2026వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు..
- అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) పోస్టుల సంఖ్య: 01
- అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఎలక్ట్రానిక్స్) పోస్టుల సంఖ్య: 09
- అసిస్టెంట్ డైరెక్టర్ (ఇంజినీరింగ్) పోస్టుల సంఖ్య: 01
- సూపరింటెండెంట్ ట్రాన్స్లేషన్ (హిందీ బ్రాంచ్) పోస్టుల సంఖ్య: 01
- రిసెర్చ్ ఆఫీసర్ పోస్టుల సంఖ్య: 11
- హార్టికల్చర్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టుల సంఖ్య: 04
- సాయిల్ కన్జర్వేషన్ అసిస్టెంట్ పోస్టుల సంఖ్య: 07
యూపీఎస్సీ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పోస్టును బట్టి విద్యార్హతలు మారుతాయి. సంబంధిత పోస్టులకు సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం తదితర విద్యార్హతలు కలిగి ఉండాలి. కొన్ని పోస్టులకు సంబంధిత రంగంలో ఉద్యోగానుభవం కూడా అవసరం. అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకునే పోస్టుకు సంబంధించిన విద్యార్హతలు, అనుభవం వంటి వివరాలను అధికారిక నోటిఫికేషన్లో తప్పనిసరిగా పరిశీలించాలి. అభ్యర్ధుల వయోపరిమితి అసిస్టెంట్ డైరెక్టర్ (ఇంజినీరింగ్) పోస్టులకు 30 ఏళ్లు, హార్టికల్చర్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులకు 40 ఏళ్లు, సాయిల్ కన్జర్వేషన్ అసిస్టెంట్ పోస్టులకు 40 ఏళ్లు, ఇతర పోస్టులు పోస్టులకు 35 ఏళ్ల వరకు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన కేటగిరీల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
ఈ అర్హతలు కలిగిన వారు ఆన్లైన్ విధానంలో ఆగస్టు 28, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన పురుష అభ్యర్థులు రూ.25 పరీక్ష ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు పరీక్ష ఫీజు లేదు. అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించిన అనంతరం అవసరాన్ని బట్టి స్క్రీనింగ్/షార్ట్‌లిస్టింగ్ ప్రక్రియ చేపడతారు. దరఖాస్తుల సంఖ్యను బట్టి రిక్రూట్మెంట్ టెస్ట్ నిర్వహించే అవకాశం ఉంటుంది. ఈ పరీక్షలో మెరిట్ సాధించిన అభ్యర్థులను తదుపరి దశలో ఇంటర్వ్యూకు పిలుస్తారు. తుది ఎంపికలో పరీక్ష, ఇంటర్వ్యూ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. వివిధ పోస్టులకు వేర్వేరు విద్యార్హతలు, అనుభవం, వయోపరిమితి ఉండటంతో అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు సంబంధిత పోస్టుకు సంబంధించిన పూర్తి నిబంధనలను అధికారిక నోటిఫికేషన్లో పరిశీలించాలి.
యూపీఎస్సీ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.