Headlines

Vaibhav Sooryavanshi: అంత హైప్ ఇచ్చారు.. చివరికి 8 పరుగులేనా! వైభవ్‌కు తొలి మ్యాచ్‌లోనే గట్టి దెబ్బ | Vaibhav Sooryavanshi flops in buki trophy east zone vs north east zone


Vaibhav Sooryavanshi: వైట్ బాల్ క్రికెట్‌లో సంచలనాలు సృష్టిస్తూ అందరి దృష్టిని ఆకర్షించిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి రెడ్ బాల్ క్రికెట్‌లో చేదు అనుభవం ఎదురైంది. దిలీప్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌తో సుదీర్ఘ ఫార్మాట్‌లో మెరవాలని భావించిన ఈ ధాకడ్ బ్యాటర్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 8 రన్స్ మాత్రమే చేసి పెవిలియన్ చేరారు. బెంగళూరులోని సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్ మైదానంలో నార్త్ ఈస్ట్ జోన్‌తో జరుగుతున్న ఈ పోరులో ఈస్ట్ జోన్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఈస్ట్ జోన్, నార్త్ ఈస్ట్ జోన్ మధ్య జరుగుతున్న ఈ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో నార్త్ ఈస్ట్ జోన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈస్ట్ జోన్ కెప్టెన్ ఈషాన్ కిషన్ పర్యవేక్షణలో బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ, సీనియర్ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించారు. వైట్ బాల్‌లో ధనాధన్ ఇన్నింగ్స్‌లతో ఇప్పటికే టీ20 ఇంటర్నేషనల్స్ ఆడిన వైభవ్ రెడ్ బాల్‌లో ఎలా ఆడతారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే మ్యాచ్ రెండో ఓవర్‌లోనే ఆ ఆశలన్నీ అడియాసలయ్యాయి.

సూర్యవంశీ వికెట్ తీసింది ఎవరంటే?

వైభవ్ కేవలం 6 బంతులు మాత్రమే ఎదుర్కొని 2 ఫోర్ల సాయంతో 8 రన్స్ చేశారు. నార్త్ ఈస్ట్ జోన్ వేగవంతమైన బౌలర్ బిష్వోర్‌జిత్ కుంతౌజమ్ విసిరిన బంతికి జోసెఫ్ లల్తన్‌కుమాకు క్యాచ్ ఇచ్చి వైభవ్ వెనుతిరిగారు. వైభవ్‌ను అవుట్ చేసిన 30 ఏళ్ల బిష్వోర్‌జిత్ మణిపూర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన తన కెరీర్‌లో 47 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 145 వికెట్లు పడగొట్టిన అనుభవజ్ఞుడు. తన అనుభవంతో యువ బ్యాటర్‌ను బోల్తా కొట్టించారు.

ఇది కూడా చదవండి: AUS VS BAN: ఆస్ట్రేలియా వెళ్లి.. వాళ్లకే చుక్కలు చూపించాడు! చరిత్ర సృష్టించిన బంగ్లా బౌలర్!

25 రన్స్ కే రెండు వికెట్లు డౌన్

వైభవ్ అవుట్ అయిన కాసేపటికే మరో ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ కూడా పెవిలియన్ బాట పట్టారు. ఆరో ఓవర్‌లో జోటిన్ ఫీరోఇజమ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుతిరిగిన ఈశ్వరన్ 20 బంతుల్లో 15 రన్స్ మాత్రమే చేశారు. దీంతో ఈస్ట్ జోన్ జట్టు స్కోరు 25 రన్స్ వద్ద ఉన్నప్పుడే ఇద్దరు ఓపెనర్ల వికెట్లను కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది.

ఇది కూడా చదవండి: Ravindra Jadeja: కొలంబో వేదికగా జడేజా చారిత్రాత్మక రికార్డు.. తొలి భారతీయ క్రికెటర్‌గా అరుదైన ఘనత

సెమీస్ బెర్త్ కోసం హోరాహోరీ

ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు ఆగస్టు 30 నుంచి జరగబోయే సెమీఫైనల్లో సెంట్రల్ జోన్‌తో తలపడనుంది. ఆ మ్యాచ్ సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్ 1 లో జరుగుతుంది. గతేడాది ఫైనలిస్ట్‌గా నిలిచిన కారణంగా సెంట్రల్ జోన్ నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. ఇప్పుడు ఈస్ట్ జోన్ కోలుకోవాలంటే మిగతా బ్యాటర్లు బాధ్యతాయుతంగా ఆడాల్సి ఉంది. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో చెలరేగిన వైభవ్ సూర్యవంశీకి రెడ్ బాల్ క్రికెట్ సవాలుగా మారింది. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైనప్పటికీ, రెండో ఇన్నింగ్స్‌లోనైనా ఈ యువ సంచలనం పుంజుకుని తన సత్తా చాటుతారని అభిమానులు భావిస్తున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *