Headlines

Vaibhav Sooryavanshi: అఫ్గాన్ సిరీస్‌కు ముందే మరోసారి విధ్వంసం సృష్టించనున్న వైభవ్ సూర్యవంశీ | Vaibhav sooryavanshi next match duleep trophy final september 6 india afghanistan t20 series


Vaibhav Sooryavanshi: ప్రస్తుతం ఎక్కడ చూసినా వైభవ్ సూర్యవంశీ పేరు ఇప్పుడు మారుమోగిపోతోంది. ఈ చిన్న వయసులోనే అద్భుతమైన షాట్లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న ఈ కుర్రాడు సెప్టెంబర్ 6న మళ్లీ బ్యాట్ పట్టుకోనున్నాడు. దులీప్ ట్రోఫీ 2026 టోర్నమెంట్‌లో ఈస్ట్ జోన్ తరఫున వైభవ్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈస్ట్ జోన్ జట్టు సెప్టెంబర్ 1న జరిగిన తొలి సెమీఫైనల్లో సెంట్రల్ జోన్‌పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి అడుగుపెట్టింది. చెన్నైలోని ప్రతిష్టాత్మక ఎంఏ చిదంబరం స్టేడియంలో సెప్టెంబర్ 6 ఆదివారం నుంచి ఈ ఫైనల్ సమరం ప్రారంభం కానుంది.

ఈస్ట్ జోన్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ సారథ్యంలో ఈస్ట్ జోన్ ఏకంగా 14 సంవత్సరాల తర్వాత దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు చేరడం విశేషం. ఈ రికార్డు విజయంలో వైభవ్ పాత్ర అత్యంత కీలకంగా మారింది. సెమీఫైనల్ పోరులో తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 81 బంతుల్లోనే 92 రన్స్ చేసి సెంచరీకి చేరువగా వచ్చి అవుటయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ వేగంగా 43 బంతుల్లో 40 పరుగులు జోడించి జట్టు విజయాన్ని సులభతరం చేశాడు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా వైభవ్ ఆడిన ఇన్నింగ్స్ నెటిజన్లను, సీనియర్ క్రికెటర్లను ఎంతగానో ఆకట్టుకుంది.

దులీప్ ట్రోఫీ ఫైనల్ ముగిసిన వెంటనే వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ మ్యాచ్‌లతో బిజీ కానున్నాడు. అఫ్గానిస్తాన్‌తో భారత జట్టు ఆడబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఈ ఓపెనర్ ఎంపికయ్యాడు. ఈ సిరీస్ సెప్టెంబర్ 13 నుంచి ప్రారంభం కానుండగా, రెండు, మూడు టీ20 మ్యాచ్‌లు వరుసగా సెప్టెంబర్ 15, 17 తేదీల్లో జరగనున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఈ మ్యాచ్‌లకు వేదిక కానుంది. భారత గడ్డపై వైభవ్‌కు ఇదే తొలి అంతర్జాతీయ సిరీస్ కావడం విశేషం. అంతకుముందు జింబాబ్వే పర్యటనలో అద్భుత ప్రదర్శన చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్న ఊపులో అతను ఉన్నాడు.

అఫ్గాన్‌తో పోరుకు ఎంపిక చేసిన జట్టు ఆసియా క్రీడల జట్టును పోలి ఉంది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా ఉన్న ఈ స్క్వాడ్‌లో సంజూ శామ్సన్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ లాంటి దిగ్గజాలు ఉన్నారు. ఓపెనింగ్ స్థానం కోసం వైభవ్‌కు తీవ్ర పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. జస్ప్రీత్ బుమ్రా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ వంటి ఆటగాళ్లు ఫిట్‌నెస్ నిరూపించుకుంటే బరిలోకి దిగుతారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *